Bhimaa OTT: ఓటీటీలోకి గోపీచంద్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ మూవీ భీమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Gopichand Bhimaa OTT Release: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ యాక్షన్ ఒరియెంటెడ్ మూవీ భీమా. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ నటించిన ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో భీమా ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
Bhimaa OTT Streaming Date: మాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా భీమా. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భీమా మూవీ థియేటర్లలో విడుదల అయింది.
ఇప్పటికే భీమా సినిమాకు ప్రీమియర్ షోలు పడ్డాయి. అవి చూసిన సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ భీమాపై పాజిటివ్‌గా స్పందించారు. భీమా మూవీ గోపీచంద్‌కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, దాదాపుగా శివతాండవం చేశాడని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బీజీఎమ్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం భీమా ఓటీటీ రైట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ (Bhimaa Digital Streaming) వివరాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. భీమా సినిమా ఓటీటీ హక్కులను (Bhimaa OTT Rights) ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar) సొంతం చేసుకుందని సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా (Star Maa Channel) చేజిక్కుంచుకుంది. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం.
అయితే భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ ద్వారా తెలిసింది. ఇకపోతే ఈ డీల్ భీమా విడుదల కాకముందే జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న రూల్ ప్రకారం మూవీ విడుదలైన నెల రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అంటే భీమా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఎప్రిల్ మొదటి వారం, లేదా రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే భీమా కలెక్షన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా, భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
భీమా సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. అలాగే స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, రమణ వంక ప్రొడక్షన్ డిజైన్, తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్ కాగా, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందించారు. రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ ఫైట్స్‌ని కొరియోగ్రఫీ చేశారు.