Gopichand: నేను ఇలా సాధారణంగా చెప్పను, కానీ.. గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-gopichand comments on bhimaa movie in pre release event malavika sharma priya bhavani shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gopichand Comments On Bhimaa Movie In Pre Release Event Malavika Sharma Priya Bhavani Shankar

Gopichand: నేను ఇలా సాధారణంగా చెప్పను, కానీ.. గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 04, 2024 10:02 AM IST

Gopichand In Bhimaa Pre Release Event: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు గోపీచంద్.

భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్ మాళవిక శర్మ
భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్ మాళవిక శర్మ

Gopichand About Bhimaa: మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ భీమా. ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ భారీ భడ్జెట్‌తో నిర్మించారు. భీమా మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే భీమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా భీమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో హన్మకొండ వరంగల్‌లో భీమా మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో భీమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు గోపీచంద్.

"చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్షని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బాగుంటుంది" అని గోపీచంద్ అన్నాడు.

"నేను సాధారణంగా ఇలా చెప్పాను. కానీ, ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్‌గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. బీజీఎమ్ వేరే లెవల్‌లో కొట్టాడు" అని నటీనటులు, టెక్నీషియన్స్ గురించి గోపీచంద్ తెలిపాడు.

"రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్‌కి థాంక్స్. ఈ వేడుకకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు" అని భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గోపీచంద్ చెప్పుకొచ్చాడు.

"భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. ఈ కథని గోపీచంద్ గారికి చెప్పే అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారికి కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైయింది. భీమాలో ఎనర్జీ పవర్ ఉంది. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. గోపి గారు వండర్ ఫుల్ పర్సన్. చాలా హంబుల్‌గా ఉంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. మిమ్మల్ని సినిమా వందశాతం ఎంటర్ టైన్ చేస్తుంది" అని డైరెక్టర్ ఏ హర్ష తెలిపారు.

IPL_Entry_Point