Gopichand Bhimaa: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు.. పోలీస్ గెటప్‌లో ఎద్దుపై గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్-gopichand bhima movie teaser released with powerful look ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gopichand Bhimaa: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు.. పోలీస్ గెటప్‌లో ఎద్దుపై గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్

Gopichand Bhimaa: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు.. పోలీస్ గెటప్‌లో ఎద్దుపై గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్

Sanjiv Kumar HT Telugu
Jan 08, 2024 06:12 PM IST

Gopichand Bhimaa Teaser: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన సినిమా భీమా. కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్న భిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు భీమా టీజర్‌లో గోపీచంద్ కనిపించిన తీరు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు.. పోలీస్ గెటప్‌లో ఎద్దుపై గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్
రాక్షసుల్ని వేటాడే బ్రహ్మరాక్షసుడు.. పోలీస్ గెటప్‌లో ఎద్దుపై గోపీచంద్ పవర్‌ఫుల్ లుక్

Gopichand Bhimaa Teaser Review: మాచో స్టార్ గోపీచంద్ తాజాగా నటించిన యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'భీమా'. ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష తెలుగు డెబ్యు చేస్తున్న భీమా చిత్రానికి శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. తాజాగా భీమా టీజర్‌ను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. అంటే టీజర్‌ విడుదల చేసి భీమా సినిమా ప్రమోషన్స్‌కి కిక్ స్టార్ ఇచ్చారు. నిమిషం పాటు సాగిన భీమా టీజర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్.. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అనే భగవద్గీత శ్లోకాల పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో భీమా టీజర్ ప్రారంభం అయింది. “ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా 'అని బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత ఎద్దుపై కూర్చొని మ్యాసివ్, వైల్డ్ అవతారంలో గోపీచంద్ కనిపించిన తీరు ఆశ్చర్యపరిచింది.

అలాగే భీమా టీజర్ ఓపెనింగ్ ఆధ్యాత్మిక కంటెంట్‌తో మునిలు, దుష్ట శక్తులు కనిపిస్తాయి. ఇది ఎలివేషన్స్‌తో ఆడ్రినలిన్-పంపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. తర్వాత గోపీచంద్ పవర్ ఫుల్ ఎంట్రీ అద్భుతంగా ఆకట్టుకుంది. వీడియో సూచించినట్లుగా, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆధ్యాత్మిక అంశాలతో కూడిన లార్జర్ దెన్ లైఫ్ కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ పోలీసు అవతార్‌లో మాచోగా కనిపించారు. పోలీస్ డ్రెస్‌లో పవర్-ప్యాక్డ్ లుక్‌లో గోపీచంద్‌ని చూడటం అభిమానులకు, మాస్‌ ప్రేక్షకులకు పండుగ అని చెప్పవచ్చు.

భీమా టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా అద్భుతంగా ఉన్నాయి. కన్డ డైరెక్టర్ హర్ష తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్‌ను చాలా బాగా కట్ చేశారు. అలాగే టీజర్‌తో భిమా సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా చేశారు. స్వామి జె గౌడ కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది. సలార్ ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన సెన్సేషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదనపు ఎనర్జీని జోడించారు. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్‌లో ఉంది. భీమా టీజర్ సినిమాకు హైప్ క్రియేట్ చేసింది.

ఈ టీజర్‌తో పాటే 'భీమా' సినిమా ఫిబ్రవరి 16, 2024న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. తెలుగు ప్రేక్షకులకు మంచి పవర్ ప్యాక్‌డ్ మాస్ మూవీ, గోపీచంద్ నుంచి రావాల్సిన సినిమాగా అనిపిస్తోంది.

ఇదిలా ఉంటే గోలీమార్ మూవీ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ కనిపిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా గోపీచంద్ సినిమాలు వరుసగా ప్లాప్స్ అవుతూ వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలోని పక్కా కమర్షియల్, గోపీచంద్ హిట్ డైరెక్టర్ అయిన శ్రీవాస్ తెరకెక్కించిన రామబాణం చిత్రాలు అనుకున్నంతగా హిట్ కొట్టలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో భీమా సినిమా హిట్ గోపీచంద్‌కు కీలకం కానుంది.

టాపిక్