Bheema Trailer: కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు - డివోషనల్, యాక్షన్‌తో గోపీచంద్ భీమా ట్రైలర్
Bheema Trailer: గోపీచంద్ హీరోగా నటిస్తోన్న భీమా ట్రైలర్ శనివారం రిలీజైంది. డివోషనల్ యాక్షన్ అంశాలతో విజువల్ ట్రీట్‌గా ఈ ట్రైలర్ ఉంది.
Bheema Trailer: గోపీచంద్ భీమా ట్రైలర్ శనివారం రిలీజైంది. డివోషనల్, యాక్షన్ అంశాలతో ట్రైలర్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా, పరశురాముడి గుడిని కాపాడే యోధుడిగా రెండు క్యారెక్టర్స్‌లో గోపీచంద్ కనిపించాడు. అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్‌లు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
శివలింగం అభిషేకంతో...
శివలింగం అభిషేకం సీన్‌తో డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్ ప్రారంభమైంది. అఘోరాలు కనిపించడం ఆకట్టుకుంటోంది. పరశురాముడు తన గండ్ర గొడ్డలితో అనంతసాగరాన్నే వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలను సృష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రం. అక్కడ ఆ పరమశివుడే కొలువయ్యాడు. కొందరు రాక్షసులు తమ అహంకారంతో విర్రవీగుతున్నప్పుడు త్రినేత్రుడే కాలనేత్రుడై కరుణే చూపని బ్రహ్మరాక్షసుడిని పంపించాడు అని డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.
పోలీస్ ఆఫీసర్‌గా...
ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ ట్రైలర్‌లో ఎంట్రీ ఇచ్చాడు. నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊరిలో స్మశానం కూడా సరిపోదు పోలీస్ గెటప్‌లో గోపీచంద్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పంచుతోంది. మాస్ ఆడియెన్స్ మెప్పించేలా భారీ యాక్షన్ అంశాలతో ఈ మూవీని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో గోపీచంద్ కనిపించబోతున్నాడు.
కన్నడ డైరెక్టర్...
భీమా మూవీకి కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతోనే అతడు డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కన్నడంలో శివరాజ్‌కుమార్‌తో వేద, వజ్రకాయ, భజరంగీతో పాటు పలు సినిమాలు తెరకెక్కించాడు హర్ష. భీమా సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమా సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.భీమా సినిమాను తొలుత ఫిబ్రవరి 16న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా మార్చి 8కి ఈ సినిమా వాయిదాపడింది. భీమా సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నాడు.
శ్రీనువైట్లతో విశ్వం...
గోపీచంద్‌కు సక్సెస్ లేక చాలా కాలమైంది. అతడి గత సినిమాలు రామబాణం, పక్కా కమర్షియల్ ఫెయిలయ్యాయి. దాంతో భీమాపైనే గోపీచంద్ భారీగా ఆశలు పెట్టుకున్నాడు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ మూవీ చేస్తోన్నాడు. శ్రీనువైట్ల గత సినిమాల తరహాలో యాక్షన్ కామెడీ అంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వం మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.విశ్వం మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ కాబోతోంది.
టాపిక్