Vijayawada Sea Planes: విజయవాడ నుంచి అక్టోబర్‌లో సీ ప్లేన్ డెమో సర్వీసులు, వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వనున్న కేంద్రం
Vijayawada Sea Planes: మరుగున పడిపోయిన విజయవాడ సీ ప్లేన్ సర్వీసులు మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. అక్టోబర్‌లో విజయవాడ డెమో సర్వీస్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ ప్రకటించారు.
Vijayawada Sea Planes: కృష్ణా జలాలపై విమానాల రాకపోకలు త్వరలో సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్న సమయంలో ప్రతిపాదించిన సీ ప్లేన్ సర్వీసులు తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో మళ్లీ ఈ ప్రతిపాదన జీవం పోసుకుంటోంది.
ప్రాంతీయ వైమానిక కనెక్టివిటీ పథకాన్ని మరో పదేళ్లు పొడిగించడంతో పాటు సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భారత్ లో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల రూపకల్పన, తయారీకి కంపెనీలను ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించి సరళీకృత నిబంధనలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
రీజినల్ ఎయిర్ కనెక్టివిటీ పథకాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని, సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు.
భారతదేశంలో విమానాలు, హెలికాప్టర్లు మరియు సీప్లేన్‌ల రూపకల్పన మరియు తయారీకి ప్రభుత్వం కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన సరళీకృత నిబంధనలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ ఆపరేషన్లలో పాల్గొనేందుకు ఆసక్తిని వ్యక్తం చేశాయని నాయుడు వివరించారు.
అక్టోబరులోనే…
అక్టోబరులో విజయవాడ నుంచి సీప్లేన్‌ల డెమో ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ (ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) కింద సీప్లేన్ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌కు అందుబాటులోకి రానున్నాయి. 2019కు ముందే ఈ ప్రతిపాదనలు ఉన్నా సాంకేతి కారణాలు, 2018లో నెలకొన్న రాజకీయ పరిణామాలు, ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు రావడం వంటి కారణాలతో ఈ ప్రతిపాదనలు మధ్యలో నిలిచిపోయాయి.
తాజాగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖను ఆ పార్టీకి దక్కింది. దీంతో మళ్లీ ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. సీప్లేన్ ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
టూరిజంతో పాటు, సీప్లేన్‌లు పరిశోధన, పర్యావరణ పర్యవేక్షణ, తీరప్రాంత వనరుల నిర్వహణ, తీరప్రాంత మరియు ద్వీప రక్షణ వంటి ఇతర రంగాలకు కూడా విలువైనవిగా ఉంటాయని మంత్రి చెప్పారు. విమాన కనెక్టివిటీ కోసం ఉడాన్ విజయవంతమైన మరియు విప్లవాత్మకమైన పథకం అని వివరించారు.
“పదేళ్లుగా ప్రణాళికలురచిస్తున్న ఈ పథకం త్వరలో కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను పదేళ్లపాటు పొడిగించాలని, అవసరమైన చోట మెరుగులు దిద్దాలని భావిస్తున్నామని నాయుడు చెప్పారు.
సీ ప్లేన్ నిర్వహణ కోసం రూపొందించిన పథకం 2017లో ప్రారంభించారు. 13 హెలిపోర్ట్‌లు మరియు 2 వాటర్ ఏరోడ్రోమ్‌లతో సహా 85 విమానాశ్రయాలను కలుపుతూ 579 రూట్‌లు ఈ పథకం కింద రూపొందించారు. అయితే వివిధ కారణాలతో కొన్ని మార్గాల్లో ప్రణాళికలు అర్థాంతరంగా నిలిచిపోయాయి.
గత నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ రాజ్యసభకు కొన్ని UDAN మార్గాలను నిలిపివేసినట్లు తెలిపింది" వివిధ కారణాల వల్ల ఎంపిక చేసిన ఎయిర్‌లైన్ ఆపరేటర్ సూచించిన మూడేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత కార్యకలాపాలను నిలిపివేశారని, తక్కువ ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్, ఎయిర్‌లైన్స్ షట్ డౌన్, కోవిడ్ ప్రభావం, టేకాఫ్, ల్యాండింగ్‌కు తక్కువ దృశ్యమానత VFR విజువల్ ఫ్లైట్ రూల్స్ ఉన్న విమానాశ్రయాలు మొదలైన కారణాలతో ఇవి నిలిచిపోయినట్టు పార్లమెంటుకు పార్లమెంటుకు విమానయాన శాఖ తెలిపింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుతో సమావేశమై రాష్ట్రంలో విమానాశ్రయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇవి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప మరియు కర్నూలుతో పాటు పుట్టపర్తిలో ఒక ప్రైవేట్ విమానాశ్రయం ఉన్నాయి.
ఇప్పటికే పనులు జరుగుతున్న రాజమండ్రి, కడప సహా పలు విమానాశ్రయాల్లో టెర్మినల్ విస్తరణ వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
విమాన సర్వీసులను పొడిగించే లక్ష్యంతో ప్రైవేట్ విమానాశ్రయాలను పౌర కార్యకలాపాలకు మార్చే అవకాశాలను కూడా అన్వేషించామని చంద్రబాబు చెప్పారు. కొత్త విమానాశ్రయాలపై, భూమి లభ్యత మరియు సాంకేతిక సాధ్యాసాధ్యాల ఆధారంగా కేంద్రం ప్రతిపాదనలను పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.