OTT Telugu: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Leela Vinodam OTT Streaming: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామా చిత్రం లీలా వినోదం. బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ లీలా వినోదం ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Leela Vinodam OTT Release: తెలుగులో ఎప్పుడోసారి రొమాంటిక్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, నేరుగా ఓటీటీలోకి వచ్చే చిత్రాలు తక్కువగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హవా పెరగడంతో చిన్న సినిమాలు, రొమాంటిక్ లవ్ డ్రామా సినిమాలు ఎక్కువగా ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
కాస్తా నెగెటివిటీ
అలా తాజాగా తెరకెక్కిన తెలుగు యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ లవ్ డ్రామా సినిమానే లీలా వినోదం. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా నటించాడు. బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో కంటెస్టెంట్స్‌లో ఒకరిగా అడుగు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్ గేమ్ పరంగా అలరించాడు. అయితే, అదే సీజన్‌లో కంటెస్టెంట్ అయిన సిరి హనుమంతుతో చనువుగా ఉండటంతో కాస్తా నెగెటివిటీ తెచ్చుకున్నాడు.
ఓటీటీ వెబ్ సిరీసులు
కానీ, తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌తో షణ్ముఖ్ జస్వంత్ ఫైనల్స్‌లోకి బిగ్ బాస్ తెలుగు 5 రన్నరప్‌గా నిలిచాడు. ఆ తర్వాత నుంచి పలు సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీసులు తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే ఏజెంట్ ఆనంద్ సంతోష్ అనే ఓటీటీ వెబ్ సిరీస్‌తో అలరించాడు. ఇప్పుడు తాజాగా లీలా వినోదం అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
లీలా వినోదం హీరోయిన్
తెలుగు యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన లీలా వినోదం సినిమాలో హీరోయిన్‌గా షణ్ముఖ్ జస్వంత్‌కు జోడీగా మలయాళ భామ అనఘా అజిత్ నటించింది. అలాగే, ఈ సినిమాలో గోపరాజు రమణ, సీనియర్ హీరోయిన్ ఆమని, రూపాలక్ష్మీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. లీలా వినోదం సినిమాకు పవన్ సుంకర దర్శకత్వం వహించారు.
లీలా వినోదం ఓటీటీ రిలీజ్
శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్‌పై శ్రీధర్ మారిసా లీలా వినోదం సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన లీలా వినోదం మూవీ టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. లీలా వినోదం సినిమా డైరెక్ట్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 19న ఈటీవీ విన్‌లో లీలా వినోదం ఓటీటీ రిలీజ్ కానుంది.
లీలా వినోదం ప్రీ రిలీజ్ ఈవెంట్
డిసెంబర్ 19 అర్థరాత్రి నుంచే లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. మరికొన్ని గంటల్లో లీలా వినోదం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ 17న మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో షణ్ముఖ్ జస్వంత్‌తోపాటు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ తదితరులు మూవీ విశేషాలు పంచుకున్నారు.
ఈటీవీ విన్ 5వ డైరెక్టర్
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. "లీలా వినోదం క్యూట్ లవ్ స్టోరీ. మేము ఇంట్రడ్యూస్ చేసిన 5వ డైరెక్టర్ పవన్. తప్పకుండా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అవుతాడు. అందరికీ థాంక్యూ సో మచ్. లీలా వినోదం మీ అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు.