OTT Telugu web series: ఓటీటీలో షణ్ముఖ్ జస్వంత్ నయా వెబ్ సిరీస్.. టీజర్ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Leela Vinodam OTT Telugu web series: లీలా వినోదం వెబ్ సిరీస్ టీజర్ వచ్చింది. ఈ సిరీస్‍లో షణ్ముఖ్ జస్వంత్ లీడ్ రోల్ చేస్తున్నారు. అతడి పుట్టిన రోజు సందర్భంగా నేడు టీజర్ రిలీజ్ అయింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే కాస్త ఆలస్యంగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది.
పాపులర్ యూట్యూబర్, బిగ్‍బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ‘లీలా వినోదం’ పేరుతో ఈ సిరీస్ వస్తోంది. యూట్యూబ్‍లో షార్ట్ ఫిల్మ్‌లతో ఫేమస్ అయిన షణ్ముఖ్.. ఆ తర్వాత బిగ్‍బాస్ తెలుగు 5 సీజన్‍లో పాల్గొన్నారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ప్రస్తుతం లీలా వినోదం సిరీస్‍లో బిజీగా ఉన్నారు. నేడు (సెప్టెంబర్ 16) షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సిరీస్ నుంచి ఓ టీజర్ వచ్చింది.
టీజర్ ఇలా..
లీలా వినోదం సిరీస్‍లో షణ్ముఖ్ జస్వంత్ పాత్రను పరిచయం చేస్తూ ఈ టీజర్ తీసుకొచ్చింది ఈటీవీ విన్ ఓటీటీ. ఓ బ్లాక్‍బోర్డుపై షణ్ముఖ్ రాతలు రాస్తుండగా.. “ఈ కథ నా బెస్ట్ ఫ్రెండ్ పీఎంఆర్కేవీ ప్రసాద్ గాడిది.. రేయ్” అని వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ తర్వాత షణ్ముఖ్ తిరిగి చూస్తారు. నలుగురు స్నేహితుల మధ్య ఈ స్టోరీ సాగుతుందని టీజర్‌లో అర్థమవుతోంది. మూడేళ్లుగా లీలా కుమారితో ప్రసాద్ (షణ్మక్) ప్రేమలో ఉంటాడు.
“నా లైఫ్‍లో చూస్తాననుకోని ఎనిమిదో వింత అప్పుడు జరిగింది. మా ప్రసాద్ గాడు.. మూడేళ్లుగా లవ్ చేస్తున్న లీలా కుమారితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు” అని వాయిస్ ఓవర్ కంటిన్యూ అయింది. లీలాతో ప్రసాద్ చాట్ చేస్తుంటాడు. అయితే, ఆ అమ్మాయికి ప్రేమ గురించి చెప్పాలని ఫ్రెండ్స్ ఒత్తిడి తెస్తుంటారు. ప్రసాద్ భయపడుతుంటాడు. “కానీ మా వాడికి అసలు ప్రాబ్లం ఇప్పుడు స్టార్ట్ అయింది” అని ఉంటుంది. ఆ తర్వాత వైట్ షర్టులోకి ప్రసాద్ మారిపోతాడు. అదేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ ఈ లీలా వినోదం టీజర్ ఎండ్ అయింది.
ఆలస్యంగా స్ట్రీమింగ్‍కు..
లీలా వినోదం వెబ్ సిరీస్‍ను నవంబర్ నెలలో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ వెల్లడించింది. అక్టోబర్ 3వ తేదీన వస్తుందని ఆగస్టులో అనౌన్స్‌మెంట్ సమయంలో పేర్కొంది. ఇప్పుడు దాన్ని ఆలస్యం చేసింది. నవంబర్‌కు ఈటీవీ విన్ వాయిదా వేసింది. అయితే, ఇప్పుడు తేదీని వెల్లడించలేదు.
లీలా వినోదం వెబ్ సిరీస్‍కు పవన్ సుంకర దర్శకత్వం వహించారు. రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీ, నలుగురు స్నేహితుల గ్యాంగ్‍తో ఈ సిరీస్‍ను తెరకెక్కిస్తున్నారు. షణ్ముఖ్‍కు జోడీగా అనఘా అజిత్ నటిస్తున్నారు. మదన్ మోహన్, శివ తుమ్ముల కీరోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్‍ను శ్రీధర్ మారిస నిర్మిస్తున్నారు.
దూసుకెళుతున్న కమిటీ కుర్రోళ్ళు
ఈటీవీ విన్‍లో ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు చిత్రం దుమ్మురేపుతుంది. ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, సాయి కుమార్ ముఖ్యమైన పాత్రలు చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు.