OTT Comedy Series: ఓటీటీలోకి బిగ్‍బాస్ ఫేమ్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Shanmukh Jaswanth Leela Vinodam OTT: లీలా వినోదం వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. యూట్యూబర్, బిగ్‍బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సిరీస్‍లో మెయిన్ రోల్ చేస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.
యంగ్ యాక్టర్ షణ్ముఖ్ జస్వంత్ ముందుగా యూట్యూబర్‌గా పాపులర్ అయ్యారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే యూట్యూబ్ సిరీస్‍తో ఫేమస్ అయ్యారు. తన నటనతో మెప్పించారు. సూర్య, స్టూడెంట్ అనే యూట్యూబ్ సిరీస్‍లు కూడా యూట్యూబ్‍లో దుమ్మురేపాయి. బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍లోనూ షణ్ముఖ్ పాల్గొని అదరగొట్టాడు. రన్నరప్‍గా నిలిచాడు. బిగ్‍బాస్‍తో మరింత ఫేమస్ అయ్యాడు. కాగా, తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వివరాలను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నేడు (ఆగస్టు 4) వెల్లడించింది. ఫస్ట్ రివీల్ చేసింది.
టైటిల్.. ఫస్ట్ లుక్ ఇలా..
షణ్ముఖ్ మెయిన్ రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్‍కు ‘లీలా వినోదం’ టైటిల్‍ను ఈటీవీ విన్ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు తీసుకొచ్చింది. ఆగి ఉన్న సైకిల్‍పై వెనుక కూర్చొని చేత్తో షణ్ముఖ్ జస్వంత్ బంతి ఎగరేస్తుంటే.. పక్కన ఓ స్నేహితుడు బ్యాట్ పట్టుకున్నాడు. నలుగురు స్నేహితుల గ్యాంగ్ ఈ ఫస్ట్ లుక్‍లో ఉంది.
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా నేడు (ఆగస్టు 4) లీలా వినోదం వెబ్ సిరీస్ గురించి ప్రకటన చేసింది ఈటీవీ విన్. ఫస్ట్ లుక్ తీసుకొచ్చింది. స్ట్రీమింగ్ డేట్‍ను కూడా ఫిక్స్ చేసింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
లీలా వినోదం వెబ్ సిరీస్ అక్టోబర్ 3వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. “ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అసలు సంగతి ఏంటంటే.. మీ గ్యాంగ్‍తో మీరు చేసిన అన్ని దూల పనులు, జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. అన్‍లిమిటెడ్ వినోదం పంచడానికి మా గ్యాంగ్ వచ్చేస్తోంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్‍చేసేందుకు అక్టోబర్ 3న ఈటీవీ విన్‍లో లీలా వినోదం వస్తోంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
లీలా వినోదం వెబ్ సిరీస్‍లో షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మదన్ మోహన్, శివ తుమ్ముల కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్‍కు పవన్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీధర్ మారిస నిర్మిస్తుండగా.. కృష్ణ చేతన్ సంగీతం అందిస్తున్నారు.
యూట్యూబ్ సిరీస్‍లు, బిగ్‍బాస్‍తో పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. ర్యాష్ డ్రైవింగ్‍తో ఓసారి హల్‍చల్ చేశాడు. ఇటీవల తన సోదరుడు సంపత్ వినయ్ వల్ల చిక్కుల్లో పడ్డాడు. డ్రగ్స్ కేసులో చిక్కుకొని అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ తర్వాత బయటికి వచ్చాడు. ఈ వివాదం తర్వాత అతడు చేస్తున్న ప్రాజెక్ట్ లీలా వినోదం సిరీసే.
నేరుగా వస్తున్న నరేశ్ సినిమా
సీనియర్ యాక్టర్ నరేశ్ ప్రధాన పాత్ర పోషించిన వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా వచ్చేస్తోంది. ఆగస్టు 14వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీకి అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. అస్థికలకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. శ్రీలక్ష్మి, రాగ్ మయూర్, ప్రియ వడ్లమణి, ప్రియదర్శిని ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు.