Shanmukh Jaswanth Bail: గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్.. ఏసీపీ సంచలన నిజాలు-shanmukh jaswanth received bail in drugs case and acp ramana goud comments on case ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shanmukh Jaswanth Bail: గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్.. ఏసీపీ సంచలన నిజాలు

Shanmukh Jaswanth Bail: గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్.. ఏసీపీ సంచలన నిజాలు

Sanjiv Kumar HT Telugu
Feb 23, 2024 01:23 PM IST

Shanmukh Jaswanth Get Bail From Drugs Case: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం రోజున గంజాయి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా షణ్ముఖ్‌కు బెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్.. ఏసీపీ సంచలన నిజాలు
గంజాయి కేసులో షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్.. ఏసీపీ సంచలన నిజాలు (Facebook)

Shanmukh Jaswanth Received Bail: బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం (ఫిబ్రవరి 22) తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. తన సోదరుడిని ఓ యువతి ప్రేమ విషయంలో విచారించడానికి వెళ్లిన నార్సింగి పోలీసులకు గంజాయితో షణ్ముఖ్ దొరికాడు. దాంతో షణ్ముఖ్‌ను, అతని సోదరుడు సంపత్ వినయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత షణ్ముఖ్ గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం వచ్చింది.

ఇప్పుడు తాజాగా బెయిల్‌పై షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ కనిపించలేదు. దీంతో అతనికి బెయిల్ వచ్చిందా లేదా అనేది స్పష్టత రాలేదు. అయితే, షణ్ముఖ్ జశ్వంత్‌పై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే తదితర విషయాలపై నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.

"షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో గంజాయి దొరకడం నిజమే అని ఏసీపీ రమణ తెలిపారు. తనను మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వాడుకుని వదిలేశాడని షణ్ముఖ్ అన్న మీద వైజాగ్‌కు చెందిన ఓ యువతి ఫిర్యాదు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ప్రజ్టీస్ హోమ్స్‌లో వాళ్లు ఉంటారని తెలిపింది. ఆ ఫిర్యాదుతో అక్కడికి వెళ్లి చూడగా షణ్ముఖ్ కూడా ఉన్నాడు. ఇంట్లో గంజాయి దొరికింది. దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్నాం" అని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు.

"గంజాయి దొరికిన మోతాడు చాలా తక్కువే. కానీ, గంజాయి ఎంత చిన్న మొత్తంలో దొరికినా నేరమే. కానీ, సెక్షన్స్ మాత్రం వేరుగా ఉంటాయి. అందులో భాగంగానే కేసు నమోదు చేశాం. దీనిపై విచారణ జరుగుతోంది. ఎలాంటి శిక్ష పడుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌పై అభియోగాలు ఉన్నాయి. కాబట్టి, అతనిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం. అమ్మాయి వైజాగ్ అయినా అబ్బాయి కోసం వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ కేసు పెట్టింది. అన్నీ పరిశీలించిన తర్వాత కేసు మా పరిధిలోకి రాదని తేలితే వైజాగ్‌కు మారుస్తాం" అని ఏసీపీ అన్నారు.

ఇదిలా ఉంటే షణ్ముఖ్ జశ్వంత్ మాత్రం బెయిల్‌పై బయటకు వచ్చాడు. దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షణ్ముఖ్ లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర్ పెట్టారు. అయితే, ఈ పోస్ట్‌పై పలువురు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా గురువారం నాడు షణ్ముఖ్ తన ఫ్లాట్‌లో గంజాయి సేవిస్తూ కనిపించగా.. అక్కడే ఉన్న సోదరుడి దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. అందుకే వెంటనే అన్నదమ్ములని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షణ్ముఖ్ తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో షణ్ముఖ్ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

అయితే, షణ్ముఖ్ జశ్వంత్ ఇంతకుముందు కూడా వార్తల్లో నిలిచాడు. గతంలో మద్యం మత్తులో హైదరాబాద్‌లో అతివేగంగా కారు నడిపి మూడు వాహనాలు ఢీ కొట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా మరోసారి డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఇదిలా ఉంటే షణ్ముఖ్ జశ్వంత్ మొదట షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point