Agent Anand Santosh Trailer: డిటెక్టివ్‌గా షణ్ముఖ్.. ట్రైలర్‌లో ఇరగదీశాడుగా
షణ్ముఖ్ జస్వంత్ నటించిన తాజా వెబ్‌సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సిరీస్ ఆహా వేదికగా ప్రతి శుక్రవారం పది వారాల పాటు స్ట్రీమింగ్ కానుంది.
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ నటిస్తున్న తాజా వెబ్‌సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహా వేదికగా ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇందులో షన్నూ డిటెక్టివ్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఈ వెబ్‌సిరీస్ ఆహాలో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఏజెంట్ ఆనంద్ సంతోష్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందుకు సంబంధించి ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించింది.
ఈ ట్రైలర్ గమనిస్తే.. షణ్ముఖ్ డిటెక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 10 ఎపిసోడ్స్ గల ఈ సిరీస్ ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
సంతోష్(షణ్ముఖ్) డిటెక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగా ఓ డిటెక్టివ్ ఏజెన్సీలో చేరుతాడు. అతడు, తన స్నేహితుడు అయోమయంతో(పృథ్వీ ఝాకాస్) కలిసి ఎలాంటి కేసులను పరిష్కరిస్తాడు? ఏం చేస్తారు? తెలియాలంటే ఆహాలో జులై 22 నుంచి ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ కానున్న ఏజెంట్ ఆనంద్ సంతోష్ తప్పకుండా చూడాల్సిందే.
అరుణ్ పవార్ దర్శకత్వంలో రూపొదిద్దుకున్న ఈ సిరీస్ ద్వారా షణ్ముఖ్‌ను ఇంతకు ముందెన్నడు చూడని పాత్రలో చూడబోతున్నారు. సత్యదేవ్, వందన, ఇన్ఫినిటం నెట్వర్క్ సొల్యూషన్స్‌తో కలిసి నిర్మించారు. ఇందులో పృథ్వీ, దివ్య, జనార్ధన్ వైశాలి రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సంబంధిత కథనం
టాపిక్