Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ధన లాభం.. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, శుభవార్తలు వింటారు-today rasi phalalu today december 18th rasi phalalu these zodiac signs will get money and brings luck and problems goes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ధన లాభం.. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, శుభవార్తలు వింటారు

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ధన లాభం.. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, శుభవార్తలు వింటారు

HT Telugu Desk HT Telugu
Dec 18, 2024 04:00 AM IST

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 18.12.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
నేటి రాశి ఫలాలు (freepik)

రాశి ఫలాలు (దిన ఫలాలు) : 18.12.2024

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ

మాసం: మార్గశిరం, వారం : బుధవారం, తిథి : కృ. తదియ, నక్షత్రం : పుష్య

మేష రాశి

ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ శక్తియుక్తులతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి. కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొని ఊరట చెండుతారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హెూదాలు, గౌరవం పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. మహిళలకు శుభవార్త శ్రవణం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభ రాశి

ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. పనులు మరింత చురుగ్గా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు తీరతాయి. ఉద్యోగస్తులు బాధ్యతలపై మరింత దృష్టి సారిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు రాగలవు. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.

మిధున రాశి

వ్యయప్రయాసలు ఎదురైనా అధిగమిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడుతూ వనులు పూర్తి చేస్తారు. 'ఆత్మీయుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు పరిష్కారం. ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వాహనాలు, స్థలాల కొనుగోలు యత్నాలు సఫలం. నూతన ఉద్యోగలాభం.. వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ధనప్రాప్తి శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటక రాశి

ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి మరింత లబ్ది వేడూరుతుంది. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. వ్యాపారాలు కొంతమేర పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలు ఆనందంగా గడుపుతారు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

సింహ రాశి

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. మీపై గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పరిచయాలు పెరుగుతాయి. శాస్త్రపరిశోధన విషయాలలో ఆసక్తి చూపుతారు.. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆర్థికంగా ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేసే వీలుంది. సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు వీడి ముందడుగు వేస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు మహిళలకు మానసిక ప్రశాంతత, శివాష్టకం పఠించండి.

కన్య రాశి

మొదట్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించరు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, క్రమేపీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కాంట్రాక్టర్లు, వైద్యులు పేరుగడిస్తారు. విద్యార్థులు చేజార్చుకున్న అవకాశాలు తిరిగి సాధిస్తారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. నగలు, ఇతర విలువైన వస్తువులు కొంటారు. ఆర్ధిక పరిస్థితి వారం మధ్య నుండి పుంజుకుంటుంది. వ్యాపారాలు ఒక పద్ధతి ప్రకారం నడిపి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ పనితనం చూసి పైస్థాయి నుంచి మెప్పు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. మహిళలు మనోనిబ్బరంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. లక్ష్మీనారాయణ అష్టకం పరించండి.

తుల రాశి

కొత్త వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు. ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు రాగలవు. ఒక ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే మెరుగు పడతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలం. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శివానందలహరి పారాయణ చేయండి.

వృశ్చిక రాశి

మిత్రుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావిడిగా గడుపుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఇంతకాలం వడిన కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింత అనుకూల పరిస్థితులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ ఇబ్బందులు తీరే సమయమిదే. సోదరులతో అత్యంత ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనూహ్యంగా ఒక వ్యక్తి మీకు ఆర్థికంగా చేయూతనిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు మరిన్ని లాభాలు పొందగలరు. ఉద్యోగాలలో మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు అంచనాలు నిజమయ్యే సమయం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు రాశి

మధ్యమధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఏ కార్యక్రమమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు కీలక సమాచారం ఊరటనిస్తుంది. ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో వేగం పెరుగుతుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థికంగా క్రమేపీ బలపడతారు. రావలసిన బాకీలు, అందుతాయి. వ్యాపారస్తులు ఉత్సాహంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ఉత్సాహంగా సాగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు అనుకూల పరిస్థితులు. నెలకొంటాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఋణ విమోచన అంగారక స్తోత్రం పఠించండి.

మకర రాశి

మీ వ్యూహాలు కొన్ని తప్పి నిరాశ చెందుతారు. కష్టానికి తగిన ఫలితం కనిపించక డీలాపడతారు. బంధువర్గం ఒత్తిడులు పెంచుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా నిరాశ పరుస్తుంది. ఆత్మీయులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణదాతలను ఆశ్రయిస్తారు. నిరుద్యోగుల ప్రతి ప్రయత్నంలోనూ అవాంతరాలు, వ్యాపారాలు సాదాసీదాగా సాగి స్వల్ప లాభాలు దర్శించుకుంటారు. ఉద్యోగాలలో మరింత అప్రమత్తత, బాధ్యతగా మెలగాలి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించండి.

కుంభ రాశి

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి. ఊహించని పిలుపు. ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి. చాకచక్యంగా ముందుకు సాగి సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ, భూవ్యవహారాలలో చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలసువుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ అందనాలు. వ్యూహాలు ఫలించే సమయం. మీపై ఉన్న ప్రతికూలత తొలగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు వృద్ది చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తాయి. సూర్యాష్టకం పఠించండి.

మీన రాశి

కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల విస్తృతిలో భాగస్వాముల చేయూత. బభిస్తుంది. ఉద్యోగుల సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. మహిళలకు సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. ఆంజనేయ దండకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner

సంబంధిత కథనం