IOCL Apprenticeships :ఐఓసీఎల్ అప్రెంటీస్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు దాఖలకు నవంబర్ 29 ఆఖరు తేదీ
IOCL Apprenticeships : ఐఓసీఎల్ ఏపీ, తెలంగాణలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 29వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 240 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అప్రెంటీస్‌కు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 29 గడువు నిర్ణయించారు. ఆసక్తి, అర్హులైన ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్స్, నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దాఖలు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు 240
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో మొత్తం 240 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అభ్యర్థులు కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు దాఖలు చేసుకోచ్చు.
స్టైఫండ్ ఎంత?
ఈ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక అయిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. డిప్లొమా హోల్డర్స్‌కు నెలకు రూ.10,500, నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.11,500 స్టైఫండ్ ఇస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు
1. మెకానికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా)- 20
2. సివిల్ ఇంజనీరింగ్ (డిప్లొమా)- 20
3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా)- 20
4. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (డిప్లొమా)- 20
5. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ (డిప్లొమా)- 20
6. ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ (డిప్లొమా)- 20
7. నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ (బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం)- 120
మెకానికల్ ఇంజినీరింగ్ (డిప్లొమా), సివిల్ ఇంజనీరింగ్ (డిప్లొమా), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (డిప్లొమా), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ (డిప్లొమా), ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ (డిప్లొమా) అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.10,500 స్టైఫండ్ ఇస్తారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం వంటి నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటీస్ అభ్యర్థులకు నెలకు రూ.11,500 స్టైఫండ్ ఇస్తారు. శిక్షణా కాలం ఏడాది పాటు ఉంటుంది.
అర్హతలు
ఈ అప్రెంటీస్ పోస్టులకు 2020 నుంచి 2024 మధ్య ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్ డిప్లొమా హోల్డర్స్ లేదా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అర్హులు. ఎంపిక పూర్తిగా అకడమిక్ ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. దక్షిణ ప్రాంతానికి చెందిన బోర్డు పరీక్షల్లో సాధించిన శాతం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని అందుకుంటారు. ఈ అభ్యర్థులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, చెన్నై కార్యాలయంలో సర్టిఫికేట్లు పరిశీలనకు హాజరు కావాలి.
దరఖాస్తు ఎలా చేయాలి?
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్వీమ్ (ఎన్ఏటీఎస్) https://nats.education.gov.in/ పోర్టల్ ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పాత అభ్యర్థులు అయితే ఇండియాన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టులో అప్లై చేయాలి. కొత్త అభ్యర్థులు ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేసి, ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పొందిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దాఖలు చేయడానికి నవంబర్ 29 ఆఖరు తేదీ కాగా, డిసెంబర్ 6న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ డిసెంబర్ 18 నుంచి 20 మధ్య ఉంటుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం