Thaman S: అల్లు అరవింద్, త్రివిక్రమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్.. ఏమన్నారంటే?-ss thaman about on allu aravind trivikram srinivas over telugu indian idol s3 launch in aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thaman S: అల్లు అరవింద్, త్రివిక్రమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Thaman S: అల్లు అరవింద్, త్రివిక్రమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Sanjiv Kumar HT Telugu
May 23, 2024 02:59 PM IST

Telugu Indian Idol S3 OTT Thaman S: నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్ చేశారు. ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రారంభం కానున్న నేపథ్యంలో తమన్ ఎస్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారనే వివరాల్లోకి వెళితే..

అల్లు అరవింద్, త్రివిక్రమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్.. ఏమన్నారంటే?
అల్లు అరవింద్, త్రివిక్రమ్‌పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Thaman S Allu Aravind Trivikram: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్‌తో ముందుకు రానుంది. జూన్ 7 నుంచి ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ఆహా ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది.

ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ బుధ‌వారం (మే 22) హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో హోస్ట్ శ్రీరామ్ చంద్ర, అతిథులు ఎస్ఎస్ తమన్, గీతా మాధురి, కార్తీక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలు, భావాలు పంచుకున్నారు.

"ఇండియన్ ఐడ‌ల్ 3 సీజ‌న్‌లోకి మ‌ళ్లీ రావ‌టం చాలా చాలా సంతోషంగా ఉంది. 2010 నుంచి ఇప్ప‌టి దాకా ఈ ప్రోగ్రామ్‌తో చాలా ఎమోష‌న్స్ ఎటాచ్ అయున్నాయి. ఈ సీజ‌న్‌కు సంబంధించిన‌ ఆడిష‌న్స్ జ‌రిగినప్పుడు చాలా మంది కేవ‌లం సింగ‌ర్స్ మాత్ర‌మే కాదు.. చాలా మంది సంగీత కళ‌కారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు" అని హోస్ట్ శ్రీరామ్ చంద్ర అన్నారు.

"ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 గొప్ప టాలెంట్‌ను తీసుకురాబోతుంది. తొలి రెండు సీజ‌న్స్‌ను మించిన టాలెంటెడ్ ప‌ర్స‌న్స్ వ‌చ్చారు. మూడు నాలుగు నెల‌ల పాటు ఈ మ్యూజిక‌ల్ జ‌ర్నీ కొన‌సాగ‌నుంది. ఆహా నాకు కుటుంబంలాంటిది. మంచి అనుబంధం ఉంది. ఇండియ‌న్ ఐడ‌ల్ జ‌ర్నీతో పాటు న‌టుడిగానూ ఆహాలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాను. ఇలాంటి గొప్ప మాధ్య‌మంలో ఇంకా కొత్త టాలెంట్ ప‌రిచ‌యం అవుతుంది. అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌" అని సింగర్ కమ్ హీరో శ్రీరామ్ చంద్ర తెలిపాడు.

"గత రెండు సీజన్స్ కంటే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో వరల్డ్ వైడ్ మ్యూజిక్ కంటెస్టెంట్స్ వచ్చారు. అందరిలో నుంచి 12 మంది టాప్ సింగర్స్‌ను ఎంపిక చేశాం. న‌న్ను న‌మ్మి ఇండియ‌న్ ఐడ‌ల్‌లో జ‌డ్జిగా పెట్టిన అర‌వింద్‌ గారికి, ఎంక‌రేజ్ చేసిన త్రివిక్ర‌మ్‌ గారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అలాగే ప్రీమాంట‌ల్ టీమ్‌కి థాంక్స్‌" అని మ్యూజిక్ డైరెక్టర్, జడ్జ్ తమన్ ఎస్ తెలిపారు.

"నా మ్యూజిషియ‌న్ టీమ్ ఫెంటాస్టిక్ స‌పోర్ట్ ఇచ్చారు. సీజ‌న్ 3 నుంచి గొప్ప టాలెంట్ మ‌న ముందుకు రాబోతుంది. ఇది మాకు ఓ ఎక్స్‌పీరియెన్స్ అనే చెప్పాలి. అంద‌రికీ థాంక్స్‌. జూన్ 7 నుంచి ఆహాలో ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 ప్రారంభం కానుంది" అని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 జడ్జ్ తమన్ అన్నారు.

"ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 2 చేసిన త‌ర్వాత సీజ‌న్ 3కి కాల్ వ‌స్తుంద‌ని నేను అనుకోలేదు. అయితే నాకు ఆహా నుంచి కాల్ వ‌చ్చింది. సీజ‌న్ 3కి చక్క‌గా ఆడిష‌న్స్ ముగిశాయి. మంచి కంటెస్టెంట్స్ వ‌చ్చారు. గ‌త సీజ‌న్స్‌లాగా ఈ సీజ‌న్‌లోనూ చాలా మంచి ఆణిముత్యాలు దొరికారు. వాళ్లు ఈ వేదిక ఎలా ఉప‌యోగించుకుని ప్ర‌తిభ‌ను చాటుకుంటారో చూడాలి. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 3 చాలా చాలా బావుంటుంది" అని సింగర్ గీతా మాధురి తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2024