IIT Delhi: ఇండియాలో నంబర్ 1 విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ; క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల-qs rankings iit delhi leads indian varsities in sustainability check details ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Iit Delhi: ఇండియాలో నంబర్ 1 విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ; క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల

IIT Delhi: ఇండియాలో నంబర్ 1 విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ; క్యూఎస్ ర్యాంకింగ్స్ విడుదల

Sudarshan V HT Telugu

QS Rankings: ప్రపంచంలోని అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్న విద్యా సంస్థల జాబితాను క్యూఎస్ ర్యాంకింగ్స్ అందించింది. ఈ జాబితాలో భారత్ లోని విద్యాసంస్థల్లో ఐఐటీ ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. అలాగే, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ లో బెంగళూరులోని ఐఐఎస్ సీ ప్రపంచంలోని టాప్ 50లో చోటు దక్కించుకుంది.

ఇండియాలో నంబర్ 1 విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ (Agency File Photo)

QS Rankings: క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాణ్యమైన విద్యను అందిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటీ ఢిల్లీ 171వ స్థానానికి చేరుకుంది. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గత సంవత్సరం కన్నా 255 స్థానాలు ముందుకు వచ్చింది. అయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐటీ ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.

భారత్ నుంచి మొత్తం 78 వర్సిటీలు..

2025 క్యూఎస్ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్ లో మొత్తం 78 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. దేశంలోని టాప్ 10 సంస్థల్లో తొమ్మిది ఈ సంవత్సరం తమ ర్యాంకింగ్ ను మరింత మెరుగుపరుచుకున్నాయి. దాంతోపాటు, ఈ జాబితాలోకి 21 కొత్త సంస్థలు ప్రవేశించాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్ పర్యావరణ ప్రభావానికి సంబంధించి ప్రపంచంలోని టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ లో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) ప్రపంచంలోని టాప్ 50లో చోటు దక్కించుకుంది. 2025 క్యూఎస్ సస్టెయినబిలిటీ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్న 78 భారతీయ విశ్వవిద్యాలయాల్లో 34 గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడగా, ఎనిమిది తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి.

క్యూఎస్ ర్యాంకింగ్స్

‘‘ఇది భారతీయ ఉన్నత విద్యా పర్యావరణ వ్యవస్థకు ఒక అద్భుతమైన విజయం. భారతీయ విశ్వ విద్యాలయాలు వారి సుస్థిర చొరవలతో ముందుకు సాగుతున్నాయని ఇవి నిరూపిస్తున్నాయి.’’ అని లండన్ కు చెందిన క్వాక్వెరెల్లి సైమండ్స్ (QS) వైస్ ప్రెసిడెంట్ బెన్ సౌటర్ అన్నారు. "సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో, భారతీయ విశ్వ విద్యాలయాలు ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ప్రభావం మరియు సమానత్వం లెన్స్ ల్లో తమ స్కోర్లను మెరుగుపరుచుకున్నాయి. ఇక్కడ దేశంలోని ఏ విద్యాసంస్థ కూడా టాప్ 350 లో లేదు. నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ అండ్ ఎంప్లాయిబిలిటీ అండ్ ఔట్ కమ్స్ లో భారత్ కు చెందిన విశ్వవిద్యాలయాలు మెరుగైన స్కోరు సాధించాయి' అని సౌటర్ తెలిపారు.

మొత్తం 1,740 విశ్వవిద్యాలయాలు

2025 ర్యాంకింగ్స్ లో 107 దేశాలు, భూభాగాలకు చెందిన 1,740 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 2024 ఎడిషన్ లో 95 దేశాల్లోని 1,397 విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం క్యూఎస్ ర్యాంకింగ్స్ లో అంతర్జాతీయంగా టొరంటో యూనివర్సిటీ తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఈటీహెచ్ జ్యూరిచ్ నిలిచింది. స్వీడన్ లోని లండ్ యూనివర్సిటీ, బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (UCB) లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అండ్ గవర్నెన్స్ అనే మూడు అసెస్ మెంట్ కేటగిరీల్లో యూనివర్సిటీ పనితీరు ఆధారంగా 'వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్: సస్టెయినబిలిటీ 2025' కోసం క్యూఎస్ మెథడాలజీని రూపొందించారు.