PM Modi: డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ ఆందోళన; మీడియాకు సూచన
PM Modi cautions against 'deepfake' use: డీప్ ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కృత్రిమ మేథ (artificial intelligence) ను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు. ఈ తరహా దుర్వినియోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాకు సూచించారు.
deepfake video threat: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ తొలి సెషన్ ను ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంగా 'డీప్‌ఫేక్' వీడియో (deepfake video threat) లపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సృష్టించడానికి కృత్రిమ మేధ (artificial intelligence) ను ఉపయోగించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు.
చాట్ జీపీటీ..
డీప్ ఫేక్ చాలా పెద్ద సమస్య. డీప్ ఫేక్ వీడియో (deepfake video) లపై చాట్ జీపీటీ టీమ్ కూడా తమ కంటెంట్ లో యూజర్లను అప్రమత్తులను చేసే సూచన చేయాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ‘‘గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ మధ్య అంతరాన్ని న్యూ టెక్నాలజీ పెంచకూడదని భారతదేశం విశ్వాసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావడానికి ఇదే సరైన సమయం. దీన్ని మరింత ప్రోత్సహించడానికి, వచ్చే నెలలో, భారతదేశం ఆర్టిఫిసిఏఐ గ్లోబల్ పార్టనర్‌షిప్ సమ్మిట్ (ArtificiaI Global Partnership Summit)ను నిర్వహిస్తుంది’’ అని వివరించారు. .
జీ 20 డిక్లరేషన్ లో కూడా..
న్యూఢిల్లీ జి20 డిక్లరేషన్‌లో గ్లోబల్ సౌత్ అంశం కూడా చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా గత సంవత్సరం జరిగిన G20 సమావేశాలలో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతను భారత్ వివరించిందని ప్రధాని మోదీ తెలిపారు. "గత సంవత్సరం డిసెంబర్‌లో, భారతదేశం G20 అధ్యక్ష పదవిని అంగీకరించినప్పుడు, గ్లోబల్ సౌత్ వాయిస్‌ని పెంచడం మా బాధ్యతగా తీసుకున్నాము. G20 ని సమ్మిళిత, మానవీయ కేంద్రంగా మార్చడం మా ప్రాధాన్యతగా భావించాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం జనవరిలో మొదటిసారిగా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్‌ను నిర్వహించాం” అని ప్రధాని మోదీ వివరించారు.
టాపిక్