ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్
ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్: ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. 2008లో తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏటా అత్యధిక వికెట్ల వీరుడికి ఈ క్యాప్ దక్కింది. ఐపీఎల్లో ఇప్పటి వరకూ 16 సీజన్లు ముగియగా.. 14 మంది ప్లేయర్స్ కు ఈ పర్పుల్ క్యాప్ దక్కింది. అందులో డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ రెండేసి సార్లు ఈ క్యాప్ గెలుచుకున్నారు.
డ్వేన్ బ్రావో 2013లో ఒకే సీజన్లో 32 వికెట్లు, 2015లో 26 వికెట్లతో రెండుసార్లు పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 2016, 2017 సీజన్లలో వరుసగా 23, 26 వికెట్లతో రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలిచాడు. ఈ ఇద్దరూ కాకుండా సోహైల్ తన్వీర్ (2008), ఆర్పీ సింగ్ (2009), ప్రజ్ఞాన్ ఓజా (2010), లసిత్ మలింగా (2011), మోర్నీ మోర్కెల్ (2012), మోహిత్ శర్మ (2014), ఆండ్రూ టై (2018), ఇమ్రాన్ తాహిర్ (2019), కగిసో రబాడా (2020), హర్షల్ పటేల్ (2021), యుజువేంద్ర చహల్ (2022), మహ్మద్ షమి (2023) కూడా పర్పుల్ క్యాప్ అందుకున్నారు.
ఇక ఇప్పటి వరకూ 2008 నుంచి 2023 వరకూ ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 2013 సీజన్లో డ్వేన్ బ్రావో, 2021 సీజన్లో హర్షల్ పటేల్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఒకే సీజన్లో అత్యధికంగా 32 వికెట్లు తీసుకున్నారు. ఈ లిస్టులో కగిసో రబాడా 30 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రబాడా 2020లో 30 వికెట్లు తీశాడు.
ఒక సీజన్లో పర్పుల్ క్యాప్ కూడా ప్లేయర్స్ చేతులు మారుతూ ఉంటుంది. మ్యాచ్ లు జరిగే కొద్దీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆ జాబితాను బట్టి పర్పుల్ క్యాప్ కూడా అటూ ఇటూ మారుతుంది. ఫైనల్ గా సీజన్ ముగిసిన తర్వాత అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ కు ఈ పర్పుల్ క్యాప్ దక్కుతుంది.
ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో వరల్డ్ క్లాస్ బౌలర్లు చాలా మందే ఉన్నారు. గతంలో క్యాప్ అందుకున్న భువనేశ్వర్, షమి, రబాడా, చహల్ లాంటి వాళ్లతోపాటు టాప్ ఫామ్ లో ఉన్న బుమ్రా కూడా ఈ ఏడాది పర్పుల్ క్యాప్ పై కన్నేశారు. ఇక 2018 సీజన్ నుంచి ప్రతి సీజన్లో ఒక్కో బౌలర్ ఈ క్యాప్ అందుకుంటూ వస్తున్నాడు. గతేడాది 28 వికెట్లతో షమి క్యాప్ అందుకున్నాడు. 2023లోనే జరిగిన వరల్డ్ కప్ లోనూ షమి 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా ఉన్న విషయం తెలిసిందే. అతడు గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ ఆడతాడా? మళ్లీ పర్పుల్ క్యాప్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Player | T | W | Avg | Ovr | R | BBF | EC | SR | 3w | 5w | Mdns |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1Harshal Patel | 24 | 19 | 49 | 477 | 3/15 | 9 | 12 | 4 | 0 | 0 | |
2Varun Chakaravarthy | 21 | 19 | 50 | 402 | 3/16 | 8 | 14 | 3 | 0 | 0 | |
3Jasprit Bumrah | 20 | 16 | 51 | 336 | 5/21 | 6 | 15 | 3 | 1 | 0 | |
4T Natarajan | 19 | 24 | 51 | 465 | 4/19 | 9 | 16 | 2 | 0 | 1 | |
5Harshit Rana | 19 | 20 | 42 | 383 | 3/24 | 9 | 13 | 2 | 0 | 1 | |
6Avesh Khan | 19 | 27 | 54 | 526 | 3/27 | 9 | 17 | 2 | 0 | 0 | |
7Arshdeep Singh | 19 | 26 | 50 | 505 | 4/29 | 10 | 15 | 1 | 0 | 0 | |
8Andre Russell | 19 | 15 | 29 | 295 | 3/19 | 10 | 9 | 2 | 0 | 0 | |
9Pat Cummins | 18 | 31 | 61 | 566 | 3/43 | 9 | 20 | 1 | 0 | 1 | |
10Yuzvendra Chahal | 18 | 30 | 58 | 546 | 3/11 | 9 | 19 | 1 | 0 | 0 |
Standings are updated with the completion of each game
- T:Teams
- Wkts:Wickets
- Avg:Average
- R:Run
- EC:Economy
- O:Overs
- SR:Strike Rate
- BBF:Best Bowling Figures
- Mdns:Maidens
ఐపీఎల్ FAQs
A: ఐపీఎల్లో ఒక సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. 2008లో మొదటి సీజన్ నుంచి ఇది కొనసాగుతోంది.
A: ఐపీఎల్ చరిత్రలో డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా రెండేసి సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. బ్రావో 2013, 2015 సీజన్లలో గెలుచుకోగా.. భువనేశ్వర్ కుమార్ 2016, 2017లలో అందుకున్నాడు.
A: ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు. 2013లో డ్వేన్ బ్రావో ఒకే సీజన్లో 32 వికెట్లు తీయగా.. 2021లో హర్షల్ పటేల్ కూడా 32 వికెట్లతో ఆ రికార్డు సమం చేశాడు.
A: ఐపీఎల్ మొదటి 16 సీజన్లలో 14 మంది ప్లేయర్స్ ఈ పర్పుల్ క్యాప్ అందుకున్నారు. వాళ్లలో సోహైల్ తన్వీర్ (2008), ఆర్పీ సింగ్ (2009), ప్రజ్ఞాన్ ఓజా (2010), లసిత్ మలింగా (2011), మోర్నీ మోర్కెల్ (2012), మోహిత్ శర్మ (2014), ఆండ్రూ టై (2018), ఇమ్రాన్ తాహిర్ (2019), కగిసో రబాడా (2020), హర్షల్ పటేల్ (2021), యుజువేంద్ర చహల్ (2022), మహ్మద్ షమి (2023), డ్వేన్ బ్రావో (2013, 2015), భువనేశ్వర్ కుమార్ (2016, 2017) ఉన్నారు.