తెలుగు న్యూస్ / క్రికెట్ / ఐపీఎల్ /
ఐపీఎల్ విజేతల జాబితా
ఐపీఎల్ 2008లో మొదలైంది. 2024 వరకు మొత్తం 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ 17 సీజన్లలో ఏయే టీమ్స్ విజేతలు నిలిచాయో ఒకసారి చూద్దాం. ఐపీఎల్ టైటిల్ ను అత్యధికసార్లు గెలిచిన జట్లుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ నిలిచాయి. ఈ రెండు టీమ్స్ ఐదేసి సార్లు విజేతలు కావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023లలో ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఇక ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర 2013లో మొదలైంది. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో గెలిచింది. ఈ రెండు టీమ్స్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ మూడుసార్లు టైటిల్ సాధించింది. కేకేఆర్ టీమ్ 2012, 2014, 2024లలో విజేతగా నిలిచింది. ఇక 2008లో రాజస్థాన్ రాయల్స్, 2009లో డెక్కన్ ఛార్జర్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2022లో గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ ట్రోఫీ అందుకున్నాయి. తొలి సీజన్ నుంచి ఈ మెగా లీగ్ లో ఆడుతున్నా.. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ లెవన్ పంజాబ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్) ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. అటు 2022లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ట్రోఫీ అందుకోలేదు. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 2009, 2011, 2016లలో ఫైనల్ చేరినా.. కప్పు మాత్రం అందుకోలేకపోయింది. గేల్, డివిలియర్స్, విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ ఉన్నా ఆర్సీబీ రాత మారలేదు.
ఇక ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లుగా ధోనీ, రోహిత్ శర్మ నిలిచారు. ఈ ఇద్దరూ ఐదేసిసార్లు తమ జట్లకు ట్రోఫీ అందించారు. వీళ్లు ఇప్పటికీ చెన్నై, ముంబై ఫ్రాంఛైజీలతోనే కొనసాగుతున్నారు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. ఓ ప్లేయర్ గా సీఎస్కేలో ఉండగా.. అటు రోహిత్ కూడా గతేడాది నుంచి ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లో పూర్తిగా కొత్త జట్లతో అన్ని ఫ్రాంఛైజీలు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే టైటిల్ గెలిచిన టీమ్స్ తోపాటు తొలిసారి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతున్న టీమ్స్ కూడా ఈ సీజన్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ముఖ్యంగా అందరి కళ్లూ ఆర్సీబీపైనే ఉన్నాయి. ఆ టీమ్ కెప్టెన్సీ మరోసారి విరాట్ కోహ్లికి దక్కనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈసారైనా తొలి టైటిల్ అందుకుంటుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది. అటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొత్త కెప్టెన్, కొత్త టీమ్స్ తో టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు సీజన్లుగా ఆడుతున్న టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ పై భారీ ఆశలే పెట్టుకుంది. మరి 2025 సీజన్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి.
తక్కువ చూపండిఇంకా చదవండి2023 ఐపీఎల్ విజేత: చెన్నై సూపర్ కింగ్స్ (డీఎల్ఎస్ మెథడ్)

2023 Score

GT
214/4
Vs

CSK
171/5
Ahmedabad
2022 ఐపీఎల్ విజేత: గుజరాత్ టైటన్స్

2022 Score

GT
133/3
Vs

RR
130/9
Ahmedabad
2021 ఐపీఎల్ విజేత: చెన్నై సూపర్ కింగ్స్

2021 Score

CSK
192/3
Vs

KKR
165/9
Dubai
2020 ఐపీఎల్ విజేత: ముంబై ఇండియన్స్

2020 Score

MI
157/5
Vs

DC
156/7
Dubai
2019 ఐపీఎల్ విజేత: ముంబై ఇండియన్స్

2019 Score

MI
149/8
Vs

CSK
148/7
Hyderabad
2018 ఐపీఎల్ విజేత: చెన్నై సూపర్ కింగ్స్

2018 Score

CSK
181/2
Vs

SRH
178/6
Mumbai
2017 ఐపీఎల్ విజేత: ముంబై ఇండియన్స్

2017 Score

MI
129/8
Vs

RPS
128/6
Hyderabad
2016 ఐపీఎల్ విజేత: సన్‌రైజర్స్ హైదరాబాద్

2016 Score

SRH
208/7
Vs

RCB
200/7
Bangalore
2015 ఐపీఎల్ విజేత: ముంబై ఇండియన్స్

2015 Score

MI
202/5
Vs

CSK
161/8
Kolkata
2014 ఐపీఎల్ విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్

2014 Score

KKR
200/7
Vs

PBKS
199/4
Bangalore
2013 ఐపీఎల్ విజేత: ముంబై ఇండియన్స్

2013 Score

MI
148/8
Vs

CSK
125/9
Kolkata
2012 ఐపీఎల్ విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్

2012 Score

KKR
192/5
Vs

CSK
190/3
Chennai
2011 ఐపీఎల్ విజేత: చెన్నై సూపర్ కింగ్స్

2011 Score

CSK
205/5
Vs

RCB
147/8
Chennai
2010 ఐపీఎల్ విజేత: చెన్నై సూపర్ కింగ్స్

2010 Score

CSK
168/5
Vs

MI
146/9
Mumbai
2009 ఐపీఎల్ విజేత: డెక్కన్ ఛార్జర్స్

2009 Score

DCH
143/6
Vs

RCB
137/9
Johannesburg
2008 ఐపీఎల్ విజేత: రాజస్తాన్ రాయల్స్

2008 Score

RR
164/7
Vs

CSK
163/5
Mumbai