ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్, ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్: Get the latest news on Orange Cap in IPL 2025 in Telugu - HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్  /  ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్

ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్


ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి ఏటా ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కు ఆరెంజ్ క్యాప్ ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 17 సీజన్లు జరిగాయి. ఇందులో మొత్తం 13 మంది ప్లేయర్స్ ఈ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. గతేడాది 741 రన్స్ చేసిన విరాట్ కోహ్లి రెండోసారి ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 2016లోనే అతడు 973 రన్స్ తో ఈ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే. అత్యధికంగా డేవిడ్ వార్నర్ ఈ క్యాప్ ను మూడుసార్లు గెలుచుకోవడం విశేషం.

వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ మూడు సీజన్లలో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకే ఆడటం విశేషం. ఇక 2011, 2012లలో రెండుసార్లు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడు ఆ రెండు సీజన్లలో వరుసగా 608, 733 రన్స్ చేశాడు.

ఇక ఈ ముగ్గురూ కాకుండా షాన్ మార్ష్ (2008), మాథ్యూ హేడెన్ (2009), సచిన్ టెండూల్కర్ (2010), మైఖేల్ హస్సీ (2013), రాబిన్ ఊతప్ప (2014), కేన్ విలియమ్సన్ (2018), కేఎల్ రాహుల్ (2020), రుతురాజ్ గైక్వాడ్ (2021), జోస్ బట్లర్ (2022), శుభ్‌మన్ గిల్ (2023) ఈ ఆరెంజ్ క్యాప్ అందుకున్న జాబితాలో ఉన్నారు.

ఇక ఒక సీజన్లో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. అతడు 2016 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున ఏకంగా 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ అతని రికార్డు చెక్కు చెదరలేదు. 2023లో గుజరాత్ టైటన్స్ కు ఆడిన శుభ్‌మన్ గిల్ మాత్రం కోహ్లికి దగ్గరగా వచ్చాడు. 2023లో గిల్ మొత్తం 16 మ్యాచ్ లలో 890 రన్స్ చేశాడు.

ఒక సీజన్లోనే ఆరెంజ్ క్యాప్ చేతులూ మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేయర్ ఈ క్యాప్ అందుకుంటూ ఉంటారు. మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ ఆరెంజ్ క్యాప్ జాబితాలోనూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అయితే సీజన్ మొత్తం ముగిసే సమయానికి ఎవరు అత్యధిక పరుగులు చేస్తారో వాళ్లకే ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ దక్కుతుంది.

ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ రేసు ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ ఈ క్యాప్ గెలిచిన వాళ్లలో వార్నర్, కోహ్లి, కేఎల్ రాహుల్, గిల్, రుతురాజ్, బట్లర్ లాంటి వాళ్లు ఉన్నారు. 2020 నుంచి ఐదు సీజన్లుగా ప్రతిసారీ ఆరెంజ్ క్యాప్ చేతులు మారుతూనే ఉంది. మరి ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ మరో కొత్త ప్లేయర్ చేతికి వెళ్తుందా లేదా గతంలో సాధించిన వాళ్లలో ఎవరైనా తిరిగి చేజిక్కించుకుంటారా అన్నది చూడాలి.
Other Stats
PlayerTRSRMatInnNOHSAvg30s50s100s6s
1Nicholas PooranNicholas Pooran
LSG35720877187*5914031
2Sai SudharsanSai Sudharsan
GT329151660825414013
3Mitchell MarshMitchell Marsh
LSG295171660814914017
4Shreyas IyerShreyas Iyer
PBKS25020466297*6203020
5Virat KohliVirat Kohli
RCB248143662676213010
6Suryakumar YadavSuryakumar Yadav
MI239149661674721010
7KL RahulKL Rahul
DC23815455193*5912012
8Yashasvi JaiswalYashasvi Jaiswal
RR233138770753303013
9Sanju SamsonSanju Samson
RR224143771663731010
10Ajinkya RahaneAjinkya Rahane
KKR221148771613612014
11Jos ButtlerJos Buttler
GT21815766173*432209
12Priyansh AryaPriyansh Arya
PBKS2162166601033620116
13Travis HeadTravis Head
SRH21418666067351209
14Tilak VarmaTilak Varma
MI210143650594222010
15Phil SaltPhil Salt
RCB208185660653422013

Standings are updated with the completion of each game

  • T:Teams
  • Wkts:Wickets
  • Avg:Average
  • R:Run
  • EC:Economy
  • O:Overs
  • SR:Strike Rate
  • BBF:Best Bowling Figures
  • Mdns:Maidens

ఐపీఎల్ 2025 FAQs

Q: ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ఏంటి? ఎవరికి ఇస్తారు?

A: ఐపీఎల్లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. 2008లో మొదటి సీజన్ నుంచి ఇది కొనసాగుతోంది.

Q: ఐపీఎల్లో ఇప్పటి వరకూ అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ ఎవరు?

A: ఐపీఎల్ చరిత్రలో డేవిడ్ వార్నర్ అత్యధికంగా మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. వార్న్ 2015, 2017, 2019 సీజన్లలో ఈ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

Q: ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

A: ఐపీఎల్ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లి. అతడు 2016 సీజన్లో 973 రన్స్ చేశాడు. అతని తర్వాత 2023లో శుభ్‌మన్ గిల్ 890 రన్స్ చేశాడు.

Q: ఐపీఎల్లో ఇప్పటి వరకూ ఎంతమంది ప్లేయర్స్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు?

A: ఐపీఎల్ మొదటి 16 సీజన్లలో 13 మంది ప్లేయర్స్ ఈ ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. వాళ్లలో షాన్ మార్ష్ (2008), మాథ్యూ హేడెన్ (2009), సచిన్ టెండూల్కర్ (2010), మైఖేల్ హస్సీ (2013), రాబిన్ ఊతప్ప (2014), విరాట్ కోహ్లి (2016, 2024), కేన్ విలియమ్సన్ (2018), కేఎల్ రాహుల్ (2020), రుతురాజ్ గైక్వాడ్ (2021), జోస్ బట్లర్ (2022), శుభ్‌మన్ గిల్ (2023), క్రిస్ గేల్ (2011, 2012), డేవిడ్ వార్నర్ (2015, 2017, 2019) ఉన్నారు.