IPL Points Table 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టిక 2024, టీమ్ ర్యాంకింగ్స్ | ఐపీఎల్ పాయింట్ల పట్టిక అప్ డేట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్  /  పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్: ఐపీఎల్ 2024లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించిన లీగ్ స్టేజ్ లో మ్యాచ్ లు ఆడిస్తారు. అయితే పాయింట్ల టేబుల్ మాత్రం ఒకటే ఉంటుంది. లీగ్ స్టేజ్ లో ఒక్కో టీమ్ 14 మ్యాచ్ లు ఆడుతాయి. ఆ మ్యాచ్ లలో వాళ్ల గెలుపోటములను బట్టి పాయింట్ల టేబుల్లో ఆయా టీమ్స్ స్థానాలు మారుతుంటాయి.

గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు, ఓడిన జట్టుకు సున్నా పాయింట్లు వస్తాయి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అందరి కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు టాప్ లో ఉంటుంది. ఈ ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ కు వెళ్తాయి. లీగ్ స్టేజ్ లోని మిగిలిన ఐదు నుంచి పది వరకూ ఉన్న టీమ్స్ అప్పుడే ఇంటిదారి పడతాయి. ఒకవేళ పాయింట్ల పట్టికలో రెండు జట్ల పాయింట్లు సమంగా ఉంటే వాళ్ల నెట్ రన్ రేట్ ఆధారంగా వాళ్ల స్థానాలను నిర్ణయిస్తారు. ఈ నెట్ రన్ రేట్ ను లెక్కించడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో జట్ల స్థానాలను నిర్ణయించడానికి కీలకమయ్యే నెట్ రన్ రేట్ ను లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే.. ఓ జట్టు చేసిన మొత్తం స్కోరును ఆ జట్టు ఆడిన ఓవర్లతో భాగిస్తారు. ఇందులో నుంచి ఆ జట్టు ప్రత్యర్థికి ఇచ్చిన పరుగులను, వాళ్లు వేసిన ఓవర్లతో భాగించగా వచ్చిన నంబర్ ను తీసేస్తారు. అదే ఆ టీమ్ నెట్ రన్ రేట్ అవుతుంది.

ఐపీఎల్ అనే కాదు రెండుకు మించి జట్లు ఆడే ఏ క్రికెట్ టోర్నీలో అయినా పాయింట్ల టేబుల్లో పాయింట్లు సమమైనప్పుడు ఈ నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. అందుకే మొదటి నుంచీ జట్లు కేవలం విజయం సాధించడమే కాదు.. సాధ్యమైనంత ఘనంగా గెలవడానికి ప్రయత్నిస్తుంటాయి. దీని ద్వారా వాళ్ల నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటుంది.

ఐపీఎల్ 2024లోనే కాదు గతంలో ఎన్నోసార్లు ఈ మెగా లీగ్ లో పాయింట్లు సమంగా సాధించినా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్లు లీగ్ స్టేజ్ నుంచి ముందంజ వేశాయి. ఇప్పుడు ఐపీఎల్ 2024లో పది జట్లు పాల్గొంటున్నా.. అందులో టాప్ 4కి మాత్రమే ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది.

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టిక

స్థాజట్లు
1
Indiarrrajasthan royals
2
Indiakkrkolkata knight riders
3
Indialsglucknow super giants
4
Indiasrhsunrisers hyderabad
5
Indiacskchennai super kings
6
Indiadcdelhi capitals
7
Indiapbkspunjab kings
8
Indiagtgujarat titans
9
Indiamimumbai indians
10
Indiarcbroyal challengers bengaluru
మ్యాచ్‌లుగెలుపుఓటమిటైఫ.తేపాయింట్లునె.ర.రే.సిరీస్ ఫామ్
10820016+0.622
LWWWW
9630012+1.096
WLWLW
10640012+0.094
WLWWL
10640012+0.072
WLLWW
10550010+0.627
LWLLW
11560010-0.442
LWWLW
1046008-0.062
WWLLL
1046008-1.113
LLWLW
1037006-0.272
LLLWL
1037006-0.415
WWLLL

స్థా: స్థానం, ఆ: ఆడినవి, పా: పాయింట్లు, నె.ర.రే.: నెట్ రన్ రేట్

ఐపీఎల్ వార్తలు

ఐపీఎల్ FAQs

Q: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో స్థానాలు ఎలా లెక్కిస్తారు?

A: ఐపీఎల్ 2024లో లీగ్ స్టేజ్ లో పది జట్లు పాల్గొంటాయి. వాటిలో అత్యధిక విజయాలు, అత్యధిక పాయింట్లు సాధించిన టీమ్ టాప్ లో ఉంటుంది. ఆ టీమ్ పాయింట్లు, నెట్ రన్ రేట్ ఆధారంగా ఒకటి నుంచి పది స్థానాల వరకూ ఉంటాయి. టాప్ 4 టీమ్స్ ప్లేఆఫ్స్ కు వెళ్తాయి.

Q: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు?

A: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో నెట్ రన్ రేట్ చాలా కీలకం. ఒకవేళ పాయింట్ల పట్టికలో రెండు జట్ల పాయింట్లు సమంగా ఉంటే వాళ్ల నెట్ రన్ రేట్ ఆధారంగా వాళ్ల స్థానాలను నిర్ణయిస్తారు. ఈ నెట్ రన్ రేట్ ను లెక్కించడానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో జట్ల స్థానాలను నిర్ణయించడానికి కీలకమయ్యే నెట్ రన్ రేట్ ను లెక్కించడానికి ఓ ఫార్ములా ఉంటుంది. అదేంటంటే.. ఓ జట్టు చేసిన మొత్తం స్కోరును ఆ జట్టు ఆడిన ఓవర్లతో భాగిస్తారు. ఇందులో నుంచి ఆ జట్టు ప్రత్యర్థికి ఇచ్చిన పరుగులను, వాళ్లు వేసిన ఓవర్లతో భాగించగా వచ్చిన నంబర్ ను తీసేస్తారు. అదే ఆ టీమ్ నెట్ రన్ రేట్ అవుతుంది.

Q: ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవి?

A: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్ కు వెళ్తాయి. మిగిలిన ఆరు జట్లు ఇంటిదారి పడతాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలవాలంటే విజయాలు, పాయింట్లతోపాటు నెట్ రన్ రేట్ కూడా కీలకం అవుతుంది.

Q: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో పాయింట్లు ఎలా ఇస్తారు?

A: ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ లో ఒక మ్యాచ్ లో గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు, ఓడిన జట్టుకు సున్నా పాయింట్లు వస్తాయి. ఒకవేళ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అందరి కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు టాప్ లో ఉంటుంది.