ఐపీఎల్ 2025 షెడ్యూల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 షెడ్యూల్: Full IPL 2025 Schedule, Teams, Players List, Venues, Time Table in Telugu - HT Telugu

ఐపీఎల్ షెడ్యూల్ 2025

ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 18వ సీజన్ ఈ వేసవిలో రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను పరుగుల వర్షంలో ముంచెత్తడానికి వస్తోంది. మార్చి 21 నుంచి మే 25 వరకు ఈ కొత్త సీజన్ జరగనుంది. గత మూడు సీజన్లలో పదేసి జట్లు పాల్గొనడంతో మ్యాచ్ ల సంఖ్య 74కు చేరింది. దీంతో ఈ ఏడాది కూడా 70 లీగ్ మ్యాచ్ లు, మరో నాలుగు ప్లేఆఫ్స్ తో కలిపి 74 మ్యాచ్ లు జరుగుతాయి.

రెండు సీజన్లుగా మళ్లీ పాత పద్ధతిలో అంటే హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతి టీమ్ లీగ్ స్టేజ్ లో ఆడే 14 మ్యాచ్ లలో ఏడు తన సొంత మైదానంలో, మరో ఏడు ప్రత్యర్థి జట్ల మైదానాల్లో ఆడతాయి. పది జట్లు కావడంతో రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు ఆడిస్తున్నారు.

అంటే ఒక టీమ్ తన గ్రూపులో ఉన్న ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్ లు హోమ్, అవే పద్ధతిలో ఆడుతుంది. ఇక మరో గ్రూపులో ఆ టీమ్ పక్కనే ఉండే జట్టుతో రెండు మ్యాచ్ లు.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన లీగ్ స్టేజ్ లో ఒక్కో టీమ్ మొత్తం 14 మ్యాచ్ లు ఆడుతుంది. టాప్ 4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్ చేరుకుంటాయి.

మొదట తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ తొలి క్వాలిఫయర్ లో ఆడతాయి. అందులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన టీమ్ కు మరో అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఎలిమినేటర్. ఇందులో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఆడతాయి. ఓడిన టీమ్ ఇంటిదారి పడుతుంది. గెలిచిన టీమ్ రెండో క్వాలిఫయర్ లో తొలి క్వాలిఫయర్ లో ఓడిన జట్టుతో ఆడుతుంది. ఇందులో విజేత ఫైనల్ చేరుతుంది.

దీంతో మొత్తంగా లీగ్ స్టేజ్ లో 70 మ్యాచ్ లు, ప్లేఆఫ్స్ లో 4.. ఇలా 74 మ్యాచ్ లు జరుగుతాయి. సుమారు రెండు నెలలపాటు ఐపీఎల్ 2025 జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి.
జట్లు
వేదికలు

ఐపీఎల్ 2025 లేటెస్ట్ న్యూస్

ఐపీఎల్ 2025 FAQs

Q: ఐపీఎల్ 2025లో మొత్తం ఎన్ని మ్యాచ్‌లు జరుగుతాయి?

A: ఐపీఎల్ 2025లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో లీగ్ స్టేజ్ లో 70, ప్లేఆఫ్స్ లో నాలుగు మ్యాచ్ లు ఉంటాయి.

Q: ఐపీఎల్ 2025 లీగ్ స్టేజ్ ఫార్మాట్ ఏంటి?

A: ఐపీఎల్ 2025లో పది జట్లు కావడంతో రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు ఆడిస్తున్నారు. అంటే ఒక టీమ్ తన గ్రూపులో ఉన్న ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్ లు హోమ్, అవే పద్ధతిలో ఆడుతుంది. ఇక మరో గ్రూపులో ఆ టీమ్ పక్కనే ఉండే జట్టుతో రెండు మ్యాచ్ లు.. మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన లీగ్ స్టేజ్ లో ఒక్కో టీమ్ మొత్తం 14 మ్యాచ్ లు ఆడుతుంది.

Q: ఐపీఎల్ 2025లో మొత్తం ఎన్ని జట్లు ఆడుతున్నాయి?

A: ఐపీఎల్ 2025లో మొత్తం 10 జట్లు ఆడుతున్నాయి. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్.

Q: ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఏంటి?

A: ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి మే 25 వరకు జరగనుంది. పూర్తి షెడ్యూల్ రిలీజ్ కావాల్సి ఉంది.