IPL brand Value: రూ.1.3 లక్ష ల కోట్లు దాటిన ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్
IPL brand value in 2024: ఐపీఎల్ 2008లో ప్రారంభవగా.. ఇప్పటి వరకూ 17 సీజన్లు ముగిశాయి. ప్రస్తుతం టోర్నీలో 10 జట్లు ఉండగా.. బ్రాండ్ వాల్యూ లక్ష కోట్లు దాటిపోయి వరల్డ్‌లోనే రిచ్చెస్ట్ లీగ్‌గా మరింత సుస్థిర స్థానాన్ని సాధించుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టీ20 లీగ్‌గా ఉన్న ఐపీఎల్ బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే భారత్ కరెన్సీలో రూ.1.01 లక్షల కోట్లు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఐపీఎల్ 2025 సీజన్ ఆటగాళ్ల మెగావేలం ఇటీవల దుబాయ్ వేదికగా ముగిసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ 10.7 బిలియన్ డాలర్లుగా ఉండటం విశేషం.
2008లో మొదలైన ఐపీఎల్ హవా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2008లో ఐపీఎల్‌ను ప్రారంభించింది. 2009లో దీని బ్రాండ్ విలువ 2 బిలియన్ డాలర్లకి చేరువలో ఉండగా.. ఇప్పుడు 12 బిలియన్ డాలర్లకి చేరడం విశేషం. పాకిస్థాన్ మినహా.. ఐసీసీ సభ్యత్వం ఉన్న అన్ని క్రికెట్ దేశాల్లోని ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతుంటారు.
ఫ్రాంఛైజీలు ప్రకారం చూసుకుంటే.. బ్రాండ్ వ్యాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 100 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో టాప్-4లో కొనసాగుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకి
గత ఏడాదితో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ విలువ 30 శాతం పెరిగి 81 మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ విలువ 24 శాతం పెరిగి 80 మిలియన్ డాలర్లకు చేరింది. కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ బ్రాండ్ విలువ వరుసగా 69 మిలియన్ డాలర్లు, 60 మిలియన్ డాలర్లుగా ఉంది. పాత ఫ్రాంఛైజీ అయినప్పటికీ.. ఇటీవల పుంజుకున్న పంజాబ్ కింగ్స్ 49 శాతం వృద్ధితో 68 మిలియన్ డాలర్లతో కొనసాగుతోంది.