ఐపీఎల్ 2024 టీమ్ స్టాట్స్ - బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, తాజా ఐపీఎల్ 2024 టీమ్ స్టాట్స్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్  /  జట్ల గణాంకాలు

ఐపీఎల్ 2024 జట్ల గణాంకాలు

ఐపీఎల్ 2024లో పాల్గొనే టీమ్స్ గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ చూసుకుంటే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక IPL టైటిల్స్ గెలుచుకున్నాయి. ఈ రెండు జట్లూ ఐదుసార్లు ఐపీఎల్‌ను గెలుచుకున్నాయి. అంతేకాకుండా ఈ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో స్థానంలో ఉంది. షారుఖ్ ఖాన్ జట్టు రెండుసార్లు ఐపీఎల్‌ను గెలుచుకుంది. అలాగే డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలుచుకున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు టైటిల్ రుచి చూడలేదు. 2008లో తొలిసారిగా టోర్నీ ప్రారంభమైనప్పుడు, రాజస్థాన్ రాయల్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఆ జట్టుకు కెప్టెన్‌గా ఆసీస్ మాజీ స్టార్, దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఉన్నాడు. అతని నాయకత్వంలో రాజస్థాన్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, రాజస్థాన్ మళ్లీ ఐపీఎల్ ఛాంపియన్ కాలేదు. రెండో ఏడాది అంటే 2009లో ఐపీఎల్‌ దక్షిణాఫ్రికాలో జరిగింది. డెక్కన్ ఛార్జర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ హవా మొదలైంది.

2010 ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు విజయం సాధించింది. వరుసగా రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచారు. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ వాళ్ల హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లింది. కేకేఆర్ టీమ్ 2012లో తొలిసారి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. 2013లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ల జాబితాలోకి ప్రవేశించింది. 2012 తర్వాత 2014లో కేకేఆర్ రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 2015లో ముంబై మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది. మరుసటి ఏడాది అంటే 2016లో సన్ రైజర్స్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే చెన్నైపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ వేటు పడింది. వారు తిరిగి వచ్చి 2018లో మళ్లీ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తర్వాత 2021, 2023 ఛాంపియన్లు కూడా. అంతేకాకుండా 2017, 2019, 2020లో రోహిత్‌ జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.

అయితే 2022లో గుజరాత్ టైటాన్స్ తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. చివరిసారి అంటే 2023 ఐపీఎల్‌లోనూ ఫైనల్‌కు చేరుకున్నారు. కానీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అడ్డుకట్ట వేసింది. రాబోయే ఐపీఎల్ అంటే 2024లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో ఇప్పుడు చూడాలి.

 • బ్యాటింగ్
 • బౌలింగ్
 • ఫీల్డింగ్

మొత్తం రన్స్

 • 1
  Delhi Capitals
  2573
 • 2
  Mumbai Indians
  2568
 • 3
  Royal Challengers Bengaluru
  2540

పవర్ ప్లేలో వచ్చిన రన్స్

 • 1
  Delhi Capitals
  897
 • 2
  Sunrisers Hyderabad
  836
 • 3
  Kolkata Knight Riders
  795

చివరి మూడు ఓవర్లలో తీసిన రన్స్

 • 1
  Royal Challengers Bengaluru
  507
 • 2
  Mumbai Indians
  505
 • 3
  Delhi Capitals
  467

బౌండరీల ద్వారా వచ్చిన రన్స్

 • 1
  Delhi Capitals
  1726
 • 2
  Mumbai Indians
  1658
 • 3
  Royal Challengers Bengaluru
  1654

ఫ్రీ హిట్స్

 • 1
  Kolkata Knight Riders
  12
 • 2
  Gujarat Titans
  9
 • 3
  Sunrisers Hyderabad
  8
 • Delhi Capitals
  229
 • Mumbai Indians
  215
 • Kolkata Knight Riders
  212
 • Sunrisers Hyderabad
  146
 • Royal Challengers Bengaluru
  141
 • Delhi Capitals
  135
 • LSGLucknow Super Giants
  16
 • DCDelhi Capitals
  16
 • RCBRoyal Challengers Bengaluru
  16
 • RRRajasthan Royals
  3
 • GTGujarat Titans
  2
 • MIMumbai Indians
  2

ఐపీఎల్ FAQs

Q: ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టు ఏది?

A: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (2010 & 2011), ముంబై ఇండియన్స్ (2019 & 2020) వరుసగా రెండు టైటిల్స్ గెలిచాయి.

Q: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్నిసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది?

A: మూడు సార్లు - 2009, 2011, 2016. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.

Q: ఐపీఎల్‌ తొలిసారిగా గెలిచిన భారత కెప్టెన్ ఎవరు?

A: మహేంద్ర సింగ్ ధోనీ (2010).

Q: అత్యధికసార్లు ఐపీఎల్ గెలిచిన టీమ్స్ ఏవి?

A: ఇప్పటి వరకూ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసిసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాయి.