ఐపీఎల్ 2025 ప్లేయర్ స్టాట్స్, ఐపీఎల్ 2025 ప్లేయర్ గణాంకాలు: Latest player stats of ipl 2025 batting, bowing, fielding stats in Telugu - HT Telugu
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఐపీఎల్  /  ప్లేయర్ గణాంకాలు

ఐపీఎల్ 2025 ప్లేయర్స్ స్టాటిస్టిక్స్

ఐపీఎల్ అంటే ప్లేయర్స్ గణాంకాల రికార్డు. ప్రతి ఏటా ఈ మెగా లీగ్ లో ప్లేయర్స్ కొత్త కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఐపీఎల్లో ఉన్న ప్లేయర్స్ స్టాట్స్ ఒకసారి చూద్దాం.

1) అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేశాడు. 2008 నుండి 2024 వరకు అతడు 8004 పరుగులు చేయగా.. అత్యధిక స్కోరు 113. విరాట్‌కు ఏడు సెంచరీలు, 55 అర్ధశతకాలు ఉన్నాయి.

2) ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు- ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడు కూడా కోహ్లీయే. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 973 పరుగులు చేశాడు. 2023లో గుజరాత్ టైటాన్స్ తరఫున 890 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

3) అత్యధిక ఫోర్లు- శిఖర్ ధావన్ IPLలో అత్యధిక ఫోర్లు కొట్టాడు. గబ్బర్ ఫోర్ల సంఖ్య 750. అతను 148 సిక్సర్లు కొట్టాడు. ఇక విరాట్ కోహ్లి తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు శిఖర్ ధావన్. అతని మొత్తం పరుగులు 6,617.

4) అత్యధిక సిక్సర్లు- అత్యధిక సిక్సర్ల జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 357 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతానికి అతని దగ్గరగా ఎవరూ లేరు. భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతను గేల్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. రోహిత్ 280 సిక్సర్లు బాదాడు.

5) వ్యక్తిగత అత్యధిక స్కోరు – క్రిస్ గేల్ అజేయంగా 175 పరుగులు చేయడం ఇప్పటివరకు IPL చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెండన్ మెకల్లమ్ అజేయంగా 158 పరుగులు చేశాడు.

6) బెస్ట్ స్ట్రైక్ రేట్ - ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆండ్రీ రస్సెల్ అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. రస్సెల్ స్ట్రైక్‌రేట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అతను 126 మ్యాచ్‌ల్లో 96 ఇన్నింగ్స్‌లలో 2,484 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 174.00.

7) అత్యధిక సెంచరీలు- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏడు సెంచరీలు సాధించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆరు సెంచరీలు చేశాడు.

8) ఫాస్టెస్ట్ సెంచరీ - క్రిస్ గేల్ IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కలిగి ఉన్నాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

ఐపీఎల్‌లో ఆల్ టైమ్ బౌలింగ్ రికార్డులు ఒకసారి చూద్దాం..

1) అత్యధిక వికెట్లు - యుజ్వేంద్ర చహల్ ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లను సొంతం చేసుకున్నాడు. యుజీ 160 మ్యాచ్‌లు ఆడి మొత్తం 205 వికెట్లు తీశాడు.

2) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- అల్జారీ జోసెఫ్ IPL చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను కలిగి ఉన్నాడు. అతను కేవలం 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు.

3) బెస్ట్ బౌలింగ్ యావరేజ్- మతీష పతిరణ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్‌ని కలిగి ఉన్నాడు. 20 మ్యాచ్‌లలో 17.41తో 20 వికెట్లు పడగొట్టాడు.

4) బెస్ట్ ఎకానమీ రేట్- IPL చరిత్రలో డేనియల్ వెటోరి అత్యుత్తమ ఎకానమీ రేట్‌ను కలిగి ఉన్నాడు. 27 మ్యాచ్‌ల్లో 27 ఇన్నింగ్స్‌ల్లో 698 పరుగులతో 21 వికెట్లు తీశాడు. సగటు 33.24. ఎకానమీ రేట్ 6.56. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 6.58 ఎకానమీ రేటుతో రెండో స్థానంలో ఉన్నాడు.

5) అత్యధిక డాట్ బాల్స్ - భువనేశ్వర్ కుమార్ IPLలో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కలిగి ఉన్నాడు. అతను 1670 డాట్ బాల్స్ వేశాడు.

PlayerTeamsఅత్యధిక స్కోరు స్ట్రైక్ రేట్వెర్సెస్ టీమ్ఎదుర్కొన్న బంతులు స్ట్రైక్ రేట్జట్టు స్కోరుతేదీ
1
Abhishek Sharma
Abhishek Sharma
SRH141256PBKS55256247Apr 12, 2025
2
Rishabh Pant
Rishabh Pant
LSG118*193RCB61193227May 27, 2025
3
Mitchell Marsh
Mitchell Marsh
LSG117182GT64182235May 22, 2025
4
KL Rahul
KL Rahul
DC112*172GT65172199May 18, 2025
5
Sai Sudharsan
Sai Sudharsan
GT108*177DC61177205May 18, 2025
6
Ishan Kishan
Ishan Kishan
SRH106*225RR47225286Mar 23, 2025
7
Heinrich Klaasen
Heinrich Klaasen
SRH105*269KKR39269278May 25, 2025
8
Priyansh Arya
Priyansh Arya
PBKS103245CSK42245219Apr 08, 2025
9
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi
RR101265GT38265212Apr 28, 2025
10
Shreyas Iyer
Shreyas Iyer
PBKS97*230GT42230243Mar 25, 2025
11
Jos Buttler
Jos Buttler
GT97*179DC54179204Apr 19, 2025
12
Quinton de Kock
Quinton de Kock
KKR97*159RR61159153Mar 26, 2025
13
Riyan Parag
Riyan Parag
RR95211KKR45211205May 04, 2025
14
Ishan Kishan
Ishan Kishan
SRH94*195RCB48195231May 23, 2025
15
Ayush Mhatre
Ayush Mhatre
CSK94195RCB48195211May 03, 2025
స్ట్రై.రే.: స్ట్రైక్ రేట్, మ్యా: మ్యాచ్‌లు, ఇ: ఇన్నింగ్స్, నా: నాటౌట్, అ.స్కో.: అత్యధిక స్కోరు, స: సగటు, ప: చేసిన పరుగులు, వ: వర్సెస్ టీమ, బం: ఎదుర్కొన్న బంతులు, జ.స్కో.: జట్టు స్కోరు, అ.బౌ.: అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు, వి: వికెట్లు, ప: ఇచ్చిన పరుగులు, ఓ: ఓవరలు, మె: మెయిడిన్స్, ఎ: ఎకానమీ, జ.స్కో: జట్టు స్కోరు, వే: వేదిక.

ఐపీఎల్ 2025 FQAs

Q: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

A: 2024 వరకు ఆ జాబితాలో విరాట్ కోహ్లీ (8004 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.

Q: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఎవరిది?

A: ఆండ్రీ రస్సెల్. అతని స్ట్రైక్ రేటు 174 (2024 వరకు).

Q: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ ఎవరు?

A: క్రిస్ గేల్ (357). రోహిత్ శర్మ (280) రెండో స్థానంలో ఉన్నాడు.

Q: ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరు?

A: ఐపీఎల్ చరిత్రలో స్పిన్నర్ యుజువేంద్ర చహల్ 205 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.