MS Dhoni fan : ఇదేం పిచ్చి! ధోనీ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
CSK vs SRH Dhoni fan : సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఓ వ్యక్తి ఎంఎస్ ధోనీపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ ప్లకార్డును పట్టుకున్నాడు. అందులోని కంటెంట్ చూసి అందరు షాక్ అవుతున్నారు.
MS Dhoni IPL 2024 : ఇప్పుడు చాలా మంది ఐపీఎల్ 2024ని, మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ని చూడటానికి ప్రధాన కారణం.. ఎంఎస్ ధోనీ. టీమిండియా మాజీ సారథి, సీఎస్కే మాజీ కెప్టెన్‌ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఫలితంగా.. సీఎస్కే జట్టు ఎక్కడ ఆడుతున్నా.. ఆ స్టేడియం కిక్కిరిసిపోతోంది. ఇక ధోనీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు! ధోనీని చూసేందుకు వారు ఏదైనా చేస్తారు. వీటిన్నింటి మధ్య.. ఓ ధోనీ ఫ్యాన్ చేసిన పని గురించి తెలిసి ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు. ఆ ఫ్యాన్.. తన గర్ల్‌ఫ్రెండ్‌కి బ్రెకప్ చెప్పాడు. అందుకు కారణం ఎంఎస్ ధోనీ అట!
ఇదీ జరిగింది..
ఐపీఎల్ 2024లో ఆదివారం.. చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఓ వ్యక్తి ప్లెకార్డ్ పట్టుకుని కనిపించాడు.
'నా గర్ల్‌ఫ్రెండ్ పేరులో ఏడు అక్షరాలు లేవు. అందుకే నా ప్రియురాలితో విడిపోయాను,' అని ఆ ప్లకార్డ్‌లో రాసి ఉంది. అతను సీఎస్కే జెర్సీ వేసుకుని ఉన్నాడు.
MS Dhoni fan : ఎంఎస్ ధోనీ జెర్సీ నెంబర్, బర్త్ డేట్.. 7 అన్న విషయం అందరికి తెలిసింది.
సీఎస్కే అభిమాని ప్లకార్డును ఇక్కడ చూడండి:
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియరాలేదు! ఆ ధోనీ ఫ్యాన్ నిజంగానే గర్ల్‌ఫ్రెండ్‌ని వదిలేశాడా? లేక ఫన్నీగా ప్లకార్డ్ పట్టుకున్నాడా? అనేది చర్చ జరుగుతోంది.
కాగా.. ధోనీ పేరుతో అభిమానులు ఇలాంటి పనులు చేయడం ఇది కొత్తేమీ కాదు! ఈ ఐపీఎల్ 2024లోనే కొన్ని రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ఈ వ్యక్తి.. తన పిల్లల్ని స్టేడియంకు తీసుకెళ్లి, ధోనీని చూపించాడు. అందరు సంతోషంగా ఇంటికి వెళ్లారు. అయితే.. ఆ మ్యాచ్‌కు టికెట్లు దొరకకపోవడంతో రూ. 64వేలు ఖర్చు చేసి, బ్లాక్‌లో టికెట్లు కొని మరీ తన పిల్లల్ని స్టేడియంకు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి. కాగా.. తన పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేదని, ఆ డబ్బులతోనే మ్యాచ్‌కు వచ్చామని చెప్పడం గమనార్హం.
ఇదీ చూడండి:- MS Dhoni record: ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు ధోనీ.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సీఎస్కే మాజీ కెప్టెన్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్లో ఐదో విక్టరీని నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. మైఖేల్ హస్సీని వెనక్కి నెట్టి సీఎస్కే తరఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 పరుగులు చేశాడు.
IPL 2024 updates : ఐపీఎల్ 2024 ర్యాంకింగ్స్‌లో చెన్నై ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ తన తదుపరి రెండు మ్యాచ్‌లను మే 1, 5 తేదీల్లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
సంబంధిత కథనం