MS Dhoni : రాంచీలో చిక్కుకుపోయిన ధోనీ.. డబ్బులు కావాలంటూ మెసేజ్! షాక్ అవుతున్న నెటిజన్లు
MS Dhoni scam : ఎంఎస్ ధోనీ రాంచీలో చిక్కుకుపోయాడని, బయటపడటానికి డబ్బులు కావాలని అడిగినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అసలు కథ తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
MS Dhoni latest news : క్రికెట్ అభిమానులను, ధోనీ ఫ్యాన్స్‌ని షాక్ గురి చేసే ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ధోనీ రాంచీలో చిక్కుకుపోయాడంటూ, బయపడటానికి డబ్బులు కావాలంటూ కొందరు స్కామ్ చేయడం.. అందరిని ఆందోళనకు గురిచేస్తోంది!
ఇదీ జరిగింది..
ఇటీవలి కాలంలో స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రముఖుల పేర్లు వాడుకుని చాలా మంది ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ధోనీ విషయంలో కూడా ఇదే జరిగింది!
"హాయ్. నేను ఎంఎస్ ధోనీ. నా ప్రైవేట్ అకౌంట్ నుంచి నేను నీకు మెసేజ్ చేస్తున్నాను. నేను రాంచీ శివారు ప్రాంతంలో చిక్కుకుపోయాను. నా వాలెట్ మర్చిపోయాను. నాకు రూ. 600 ఫోన్‌పే చేయగలవా? బస్సులో ఇంటికి వెళ్లడానికి నాకు డబ్బులు కావాలి. ఇంటికి తిరిగి వెళ్లగానే నీకు డబ్బులు ఇచ్చేస్తాను," అని కొందరికి మెసేజ్‌లు వెళుతున్నాయి. ధోనీ ఫొటోను ఒ పొలానికి అతకించి పంపుతున్నారు. అకౌంట్ పేరు ఎంఎస్ ధోనీ- మహీ77ఐ2 గా ఉంది.
Latest scam alert : కానీ ఇది ఒక పెద్ద స్కామ్. మెసేజ్ వచ్చిన అకౌంట్ పేరు ఎంఎస్ ధోనీ- మహీ77ఐ2. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అకౌంట్ పేరు మహీ7781.
ఇదీ చూడండి:- Fake Doctorate Scam: డాక్టరేట్ ఇస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే!
ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కు 2లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఆన్లైన్ మోసాల పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు డీప్‌ఫేక్ వీడియోలు, మరోవైపు ఆన్లైన్ స్కామ్‌లు.. అటు ప్రజలతో పాటు ఇటు ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సామాన్యులు ఈ స్కామ్‌లకు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఏం చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు మోసపోతున్నారు. స్కామర్లు కూడా రోజుకో విధంగా స్కామ్ చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీలు వాడుకుని.. రెచ్చిపోతున్నారు.
MS Dhoni scam : ఆన్లైన్ స్కామ్స్ సాధారణ విషయంగా మారిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ స్కామ్ అని తెలుసుకోవడానికి కొన్ని విధానాలు ఉన్నాయని చెబుతున్నారు. యూజర్ ఐడీలో స్వల్పంగా మార్పు ఉంటుందని, తద్వారా స్కామ్‌ని పట్టుకోవచ్చని అంటున్నారు. కానీ చాల మంది ఇవేవీ చూడకుండానే.. ముందుకు వెళిపోయి, ఆ తర్వాత అది స్కామ్ అని తెలుసుకుని బాధపడుతుంటారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్‌ని ఇక్కడ చూడండి :
సంబంధిత కథనం