Mayank Yadav : ‘మయాంక్​ యాదవ్​తో జాగ్రత్త’- స్టీవ్​ స్మిత్​కి బ్రాడ్​ మెసేజ్​!-broad texts steve smith get used to mayank yadav warning for ind aus tests ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mayank Yadav : ‘మయాంక్​ యాదవ్​తో జాగ్రత్త’- స్టీవ్​ స్మిత్​కి బ్రాడ్​ మెసేజ్​!

Mayank Yadav : ‘మయాంక్​ యాదవ్​తో జాగ్రత్త’- స్టీవ్​ స్మిత్​కి బ్రాడ్​ మెసేజ్​!

Sharath Chitturi HT Telugu
Mar 31, 2024 01:42 PM IST

Mayank Yadav bowling speed : ఆడిన తొలి ఐపీఎల్​ మ్యాచ్​తోనే.. వార్తలకెక్కాడు ఎల్​ఎస్​జీ ప్లేయర్​ మయాంక్​ యాదవ్​. తన అద్భుత బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు.. ఇంగ్లాండ్​ లెజేండరీ ప్లేయర్​ స్టువర్డ్​ బ్రాడ్​ కూడా.. మయాంక్​ యాదవ్​పై ప్రశంసల వర్షం కురుపించాడు.

ఎల్​ఎస్​జీ ప్లేయర్​.. మయాంక్​ యాదవ్​
ఎల్​ఎస్​జీ ప్లేయర్​.. మయాంక్​ యాదవ్​ (AFP)

Mayank Yadav stats : ఐపీఎల్​లో ఆడిన మొదటి మ్యాచ్​లోనే సంచలనం సృష్టించి, టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారాడు మయాంక్​ యాదవ్​. శనివారం.. పంజాబ్​ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో.. ఈ లక్నో సూపర్​ జెయింట్స్​ (ఎల్​ఎస్​జీ) పేసర్​.. విజృంభించాడు. 4 ఓవర్లలో 27 పరగులు ఇచ్చి.. మూడు వికెట్లు తీశాడు 21ఏళ్ల మయాంక్​ యాదవ్​. కాగా.. అతను వేసిన స్పీడ్స్​కి ఐపీఎల్​ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కన్సిస్టెన్సీతో 150 కేఎంపీహెచ్​ బాల్స్​ వేశాడు మయాంక్​ యాదవ్​. అంతేకాకుండా.. ఈ సీజన్​లోనే ఫాస్టెస్ట్​ డెలివరీ (155.8 కేపీహెచ్​) వేశాడు ఈ ఎల్​ఎస్​జీ బౌలర్​. ఫలితంగా.. మొదటి మ్యాచ్​లోనే అందరిని దృష్టి ఆకర్షించాడు. ఇంగ్లాండ్​ దిగ్గజ పేసర్​ స్టువర్డ్​ బ్రాడ్​ అయితే.. మయాంక్​ యాదవ్​ని ఆకాశానికి ఎత్తేశాడు!

మయాంక్​పై బ్రాడ్​ ప్రశంసలు..

స్టార్​ స్పోర్ట్స్​తో మాట్లాడిన స్టువర్ట్​ బ్రాడ్​.. మయాంక్​ బౌలింగ్​పై ప్రశంసల వర్షం కురిపించాడు. లైన్​ అండ్​ లెన్త్​పై మయాంక్​ యాదవ్​కి ఉన్న గ్రిప్​ని మెచ్చుకున్నాడు.

Mayank Yadav IPL auction : "మయాంక్​ దగ్గర పేస్​ సహజంగానే ఉంది. కానీ లైన్​ అండ్​ లెన్త్​ని కూడా అతను కంట్రోల్​ చేస్తుండటం.. చాలా గొప్ప విషయం. యంగ్​ బౌలర్​గా వచ్చినప్పుడు ఎమోషన్స్​ ప్లే అవుతాయి. ఎంత వేగంగా అయితే ఎంత వేగంగా బాల్స్​ వేద్దామని చూస్తారు. కానీ బౌలింగ్​పై కంట్రోల్​ ఉండదు. కానీ.. లైన్​ అండ్​ లెన్త్​పై మయాంక్​ యాదవ్​కి ఉన్న కంట్రోల్​.. నన్ను ఇంప్రెస్​ చేసింది. నిజమే.. యాదవ్​ బౌలింగ్​ బెయిస్ట్రో ఒక అద్భుతమైన షాట్​ కొట్టాడు. కానీ అదొక్కటి తప్ప.. మయాంక్​ యాదవ్​, బ్యాటర్లకు వేరే అవకాశం ఇవ్వలేదు. జానీ బెయిర్​స్టో వంటి వరల్డ్​ క్లాస్​ ప్లేయర్లకు ఇబ్బంది పడ్డారంటే.. యంగ్​ బౌలర్​లో ఓ స్పెషాలిటీ ఉన్నట్టే!" అని అన్నాడు స్టువర్డ్​ బ్రాడ్​.

ఎల్​ఎస్​జీ వర్సెస్​ పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​లో మయాంక్​ యాదవ్​కి ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ రావడం సంతోషకరం అని అన్నాడు బ్రాడ్​. "నేను ఒక ఫాస్ట్​ బౌలర్నే. ఇంకో ఫాస్ట్​ బౌలర్​కి ఆ అవార్డు వచ్చిందంటే. చాలా హ్యాపీగా ఉంటుంది," అని ఇంగ్లాండ్​ దిగ్గజ పేసర్​ అన్నాడు.

Mayank Yadav fastest ball : అంతేకాకుండా.. మయాంక్​ యాదవ్​ గురించి ఆస్ట్రేలియన్​ బ్యాటర్​ స్టీవ్​ స్మిత్​కి మెసేజ్​ చేసినట్టు చెప్పుకొచ్చాడు బ్రాడ్​.

ఈ ఏడాది చివర్లో.. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడనుంది. అందులో.. మయాంక్​ యాదవ్​ ఉంటే మాత్రం, ఆస్ట్రేలియా జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నట్టు స్మిత్​కి చెప్పాడు బ్రాడ్​.

"ఆస్ట్రేలియా సిరీస్​కి ఇంకా చాలా టైమ్​ ఉంది. ఇంకా అంత దూరం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్టీవ్​ స్మిత్​కి నేను ఇప్పటికే మెసేజ్​ చేశాను. ఆస్ట్రేలియాలో మయాంక్​ యాదవ్​ కనిపిస్తే.. జాగ్రత్త, ఇలాంటి బాల్స్​ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పాను," అని అన్నాడు స్టువర్ట్​ బ్రాడ్​.

ఎల్​ఎస్​జీ వర్సెస్​ పంజాబ్​..

LSG vs PBSK highlights : శనివారం లక్నోలో జరిగిన ఎల్​ఎస్​జీ వర్సెస్​ పంజాబ్​ మ్యాచ్​లో.. తొలుత బ్యాటింగ్​ చేసిన కేఎల్​ రాహుల్​ సేన.. 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి.. 199 పరుగులు చేసింది. కాగా.. మయాంక్​ యాదవ్​ ధాటికి.. పంజాబ్​ కింగ్స్​.. 5 వికెట్లు కోల్పోయి.. 20 ఓవర్లకు 178 రన్స్​ మాత్రమే చేయగలిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం