LSG vs PBKS : బౌలింగ్​ పిచ్​పై పంజాబ్​ కింగ్స్​ రాణిస్తుందా? ఎల్​ఎస్​జీ గెలుస్తుందా?-lsg vs pbks ipl 2024 head to head stats and more details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Pbks : బౌలింగ్​ పిచ్​పై పంజాబ్​ కింగ్స్​ రాణిస్తుందా? ఎల్​ఎస్​జీ గెలుస్తుందా?

LSG vs PBKS : బౌలింగ్​ పిచ్​పై పంజాబ్​ కింగ్స్​ రాణిస్తుందా? ఎల్​ఎస్​జీ గెలుస్తుందా?

Sharath Chitturi HT Telugu
Mar 30, 2024 06:40 AM IST

LSG vs PBKS IPL 2024 : లక్నో వేదికగా నేడు ఎల్​ఎస్​జీ వర్సెస్​ పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు జట్ల హెడ్​ టు హెడ్​ స్టాట్స్​, పిచ్​ రిపోర్ట్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎల్​ఎస్​జీ ఫీల్డింగ్​ కోచ్​ జాంటీ రోడ్స్​తో శిఖర్​ ధావన్​
ఎల్​ఎస్​జీ ఫీల్డింగ్​ కోచ్​ జాంటీ రోడ్స్​తో శిఖర్​ ధావన్​

LSG vs PBKS head to head : ఐపీఎల్​ 2024లో నేడు మరో ఆసక్తికర మ్యాచ్​ జరగనుంది. లక్నో ఎకాన స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు.. లక్నో సూపర్​ జైంట్స్​ (ఎల్​ఎస్​జీ) వర్సెస్​ పంజాబ్​ కింగ్స్​ (పీబీకేఎస్​) మ్యాచ్​ జరగనుంది. ఐపీఎల్​ పాయింట్స్​ టేబుల్​లో కేఎల్​ రాహుల్​ సేన చివరి స్థానంలో ఉండటంతో.. ఈ మ్యాచ్​లో గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది.

ఎల్​ఎస్​జీ వర్సెస్​ పీబీకేఎస్​- హెడ్​ టు హెడ్​ స్టాట్స్​..

ఐపీఎల్​ 2024లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్​ మాత్రమే ఆడిన ఎల్​ఎస్​జీ.. అందులో ఓటమి పాలైంది. రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక.. శిఖర్​ ధావన్​ పంజాబ్​ కింగ్స్​.. రెండు మ్యాచ్​లు ఆడి, ఒక దాంట్లో విజయంసాధించింది. ఆర్​సీబీతో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇక హెడ్​ టు హెడ్​ స్టాట్స్​ విషయానికొస్తే.. ఎల్​ఎస్​జీ- పంజాబ్​ కింగ్స్​ జట్లు ఇప్పటి వరకు కేవలం మూడు సార్లు మాత్రమే తలపడ్డాయి. శనివారం మ్యాచ్​తో ఆ కౌంట్​ 4కు పెరుగుతుంది.

LSG vs PBKS match prediction : ఇక మూడు మ్యాచ్​లలో.. పంజాబ్​పై ఎల్​ఎస్​జీకి ఆధిపత్యం ఉంది. రాహుల్​ సేన 2 సార్లు గెలిస్తే, పంజాబ్​ కింగ్స్​ 1సారి విజయం దక్కించుకుంది.

ఇక లక్నో ఎకాన స్టేడియంలో ఎల్​ఎస్​జీ స్టాట్స్​ మిక్స్​డ్​గా ఉన్నాయి. ఇక్కడ ఆ జట్టు 7 మ్యాచ్​లు ఆడగా.. మూడింట్లో గెలిచి, మూడింట్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్​లో రిజల్ట్​ రాలేదు.

మరోవైపు.. ఎకానా స్టేడియంలో ఇప్పటివరకు ఒకటే మ్యాచ్​ ఆడిన పీబీకేఎస్​.. అందులో గెలిచింది.

ఇదీ చూడండి:- RCB vs KKR: ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా

పిచ్​ ఎలా ఉంటుంది..?

LSG vs PBKS match pitch report : ఐపీఎల్​ 2024లో ఇప్పటి వరకు అనేక హై స్కోరింగ్​ మ్యాచ్​లు చూసి ప్రేక్షకులు థ్రిల్​ అయ్యారు. అయితే.. లోక్నో ఎకాన స్టేడియం.. బౌలింగ్​ ఫ్రెండ్లీగా ఉంటూ వచ్చింది. ఇక్కడ.. ఫస్ట్​ ఇన్నింగ్స్​ యావరజే 148గా ఉంది. పేసర్లు, స్పిన్నర్లకు సమానంగా అవకాశాలు లభించే పిచ్​. వేగంగా పరుగులు చేసే విషయంలో మాత్రం బ్యాట్స్​మెన్​ కష్టపడుతూ వచ్చారు. ఈసారి కూడా అదే రిపీట్​ అవ్వొచ్చు! శనివారం జరగనున్న మ్యాచ్​లోనూ.. పిచ్​, బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.

ఎల్​ఎస్​జీ వర్సెస్​ పీబీకేఎస్​- జట్లు..

ఎల్​ఎస్​జీ (ప్రాబెబుల్​ 11):- కేఎల్​ రాహుల్​ (కెప్టెన్​), క్వింటన్​ డికాక్​, ఆయుష్​ బదోనీ, నికోలస్​ పూరన్​, మార్కస్​ స్టోయినిస్​/ కైల్​ మేయర్స్​, కృణాల్​ పాండ్యా, రవి బిష్ణోయ్​, మోసిన్​ ఖాన్​, యష్​ ఠాకుర, నవీన్​-ఉల్​-హక్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​- దీపక్​ హుడా)

LSG vs PBKS IPL 2024 : పీబీకేఎస్​ (ప్రాబెబుల్​ 11):- శిఖర్​ ధావన్​(కెప్టెన్​), జానీ బెయిర్​స్టో, ప్రభ్​సిమ్రాన్​ సింగ్​, జితేశ్​ శర్మ, సామ్​ కరన్​, లియామ్​ లివింగ్​స్టోన్​, శశాంక్​ సింగ్​, హర్​ప్రీత్​ బ్రార్​, కగిసో రబాడ, రాహుల్​ చాహర్​. (ఇంపాక్ట్​ ప్లేయర్​- అర్షదీప్​ సింగ్​).

Whats_app_banner

సంబంధిత కథనం