RCB vs KKR: ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా-rcb vs kkr ipl 2024 match narine venkatesh iyer smashed rcb bowlers to give knight riders another win ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Kkr: ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా

RCB vs KKR: ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా

Hari Prasad S HT Telugu
Mar 29, 2024 10:52 PM IST

RCB vs KKR: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్ లో కేకేఆర్ సులువుగా గెలిచింది.

ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా
ఇరగదీసిన కేకేఆర్ బ్యాటర్లు.. సొంతగడ్డపై ఆర్సీబీకి మరో ఘోర పరాభవం.. కోహ్లి ఇన్నింగ్స్ వృథా (PTI)

RCB vs KKR: విరాట్ కోహ్లి కళ్లు చెదిరే ఇన్నింగ్స్ కూడా ఆర్సీబీని ఆదుకోలేకపోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈజీగా చేజ్ చేసేసింది. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిల్ సాల్ట్ తోపాటు వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ చెలరేగడంతో కేకేఆర్ టీమ్ 19 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ సీజన్లో నైట్ రైడర్స్ కు ఇది వరుసగా రెండో విజయం కాగా.. ఆర్సీబీ మూడు మ్యాచ్ లలో రెండో ఓటమి.

నైట్ రైడర్స్ మెరుపు చేజింగ్

ఆర్సీబీ బ్యాటర్లు మొదట బ్యాటింగ్ చేసి కష్టంగా 182 పరుగులు చేస్తే.. ఆ టార్గెట్ ను నైట్ రైడర్స్ మాత్రం మంచి నీళ్లు తాగినంత సులువుగా కొట్టేశారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ వచ్చీ రాగానే బాదడం మొదలు పెట్టారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఈ ఇద్దరూ 18 పరుగులు చేశారు. తొలి ఓవర్లో సాల్డ్ బాదగా.. తర్వాతి నుంచి నరైన్ హార్డ్ హిట్టింగ్ మొదలు పెట్టాడు.

నరైన్ సిక్స్ ల మోత మోగించాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫిల్ సాల్ట్ కూడా 20 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 30 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ ఆరు పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరినా.. తర్వాత వచ్చిన వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ జోడీ కేకేఆర్ ను విజయం వైపు నడిపింది.

ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్ ధాటిగా ఆడాడు. అతడు కేవలం 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్ చివరికి వరకూ క్రీజులో ఉండి.. సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. అతడు 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

కోహ్లి రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్

అంతకుముందు విరాట్ కోహ్లి కేకేఆర్ తో మ్యాచ్ లో 59 బంతుల్లోనే 83 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. అతనికి గ్రీన్ (33), మ్యాక్స్‌వెల్ (28), చివర్లో దినేష్ కార్తీక్ (20) మంచి సహకారం అందించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతోపాటు ఓ అరుదైన రికార్డునూ బ్రేక్ చేశాడు.

విరాట్ కోహ్లి ఈ ఏడాది తొలి మ్యాచ్ నుంచీ టాప్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లోనే టీ20ల్లో 12 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ గా నిలిచాడు. రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో టీ20ల్లో వంద 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఇండియన్ బ్యాటర్ అయ్యాడు. ఇక ఇప్పుడు మూడో మ్యాచ్ లో ధోనీ, గేల్, డివిలియర్స్ లాంటి వాళ్ల రికార్డులను బ్రేక్ చేశాడు.

అంతేకాదు ఓపెనర్ గా వచ్చిన కోహ్లి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 59 బంతుల్లో 83 రన్స్ చేశాడు కోహ్లి. అతని పోరాటంతోనే ఆర్సీబీ 182 పరుగులు భారీ స్కోరు చేయగలిగింది. డుప్లెస్సి, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నా.. ఈ ముగ్గురూ తొలి మూడు మ్యాచ్ లలో విఫలమయ్యారు. దీంతో బ్యాటింగ్ భారమంతా కోహ్లిపైనే పడుతోంది. చివర్లో కార్తీక్ మెరుపులు ఆ టీమ్ కు కాస్త కలిసి వస్తున్నాయి.