తెలుగు న్యూస్ / ఫోటో /
KKR Mistakes: కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం.. అయినా సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఇవే!
Kolkata Knight Riders Winning Mistakes: కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసినా విజయం అంత సులువుగా రాలేదు. కేకేఆర్ కేవలం నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్ ఎలాంటి తప్పులను సరిదిద్దుకోవాలి అనే వివరాల్లోకి వెళితే..
(1 / 5)
ప్రస్తుతం కోల్‍కతాకు మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్.. కెప్టెన్‍గా ఉన్న సమయంలో చేసినట్టు సునీల్ నరేన్‍ను ఓపెనర్‌గా పంపకపోతేనే మేలు. ఎందుకంటే సునీల్ నరైన్‌ను ఎలా ఔట్ చేయాలో అందరికీ తెలుసు. ఫిల్ సాల్ట్‌తో శాశ్వత ఓపెనర్‌ను ఎంచుకోవాలి. (All Photos @ANI)
(2 / 5)
వరుసగా మూడు సిక్సర్లు బాదిన సాల్ట్ మంచి లయను అందుకున్నప్పుడు, వెంకటేష్, శ్రేయాస్ అయ్యర్ అనవసరమైన భారీ షాట్లు వేస్తూ వికెట్లు పోగొట్టుకున్నారు. దీన్ని కేకేఆర్ బ్యాట్స్ మెన్ సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మరింత దూకుడుగా వ్యవహరించడం వల్ల కలిగే పరిణామాలు సీజన్ తొలి మ్యాచ్లోనే అర్థమయ్యాయి. అయ్యర్, నితీశ్ రాణా వరుసగా ఔట్ కావడంతో సాల్ట్ ఒత్తిడిలోకి వెళ్లాల్సి వచ్చింది.
(3 / 5)
డెత్ బౌలింగ్ సమస్యలు: 2023లో, 2024లో తొలి మ్యాచ్‌లో ఉన్న సమస్య తొలగిపోలేదు. కేకేఆర్ 17, 18, 19 ఓవర్లలో 63 పరుగులు సమర్పించుకుంది. ఫలితంగా 20వ ఓవర్ ఆరంభంలోనే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గుప్పిట్లోకి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్ వెంటనే డెత్ బౌలింగ్ నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది.
(4 / 5)
ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాలి: సుయాష్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే శనివారం సన్ రైజర్స్ జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ మూడు క్యాచ్‌లు మిస్ చేసింది. అయినా నాలుగు పరుగుల తేడాతో గెలిచింది.
(5 / 5)
ఓవరాల్‌గా బౌలింగ్ నాణ్యత పెంచుకోవాలి: తొలి మ్యాచ్ లో కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగం చాలా అస్తవ్యస్తంగా కనిపించింది. చివరి ఓవర్లో హర్షిత్ రాణించినా పేసర్లు వేసిన 10 ఓవర్లలో 111 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రమే పేలవప్రదర్శన చేశాడు. సునీల్ నరైన్, సుయాష్ బాగా బౌలింగ్ చేశారు. కాబట్టి, ఓవరాల్ గా జట్టు బౌలింగ్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇతర గ్యాలరీలు