KL Rahul LSG vs RR: గాయాలు నా స్నేహితుల్లా మారాయి: కేఎల్ రాహుల్ కామెంట్
LSG vs RR IPL 2024 - 2024: ఐపీఎల్ 2024లో తమ తొలి మ్యాచ్‍కు బరిలోకి దిగాయి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా భారత స్టార్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
LSG vs RR - IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‍ఎస్‍జీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తమ పోరును నేడు (మార్చి 24) మొదలుపెట్టాయి. జైపూర్ వేదికగా నేడు ఈ రెండు జట్లు ఈ సీజన్‍లో తమ తొలి మ్యాచ్‍కు బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. అయితే, టాస్ సమయంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.
గాయాలు.. బెస్ట్ ఫ్రెండ్స్‌లా..
భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండేళ్లుగా కొన్నిసార్లు గాయపడ్డాడు. దీంతో కొన్నిసార్లు టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2023 నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడు. ఆ తర్వాత భారత జట్టులోకి మళ్లీ వచ్చినా.. మధ్యమధ్యలో గాయాలు అతడిని వేధించాయి. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‍తో జరిగిన టెస్టు సిరీస్‍లోనూ తొలి టెస్టు తర్వాత అతడు గాయపడి.. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‍లకు దూరమయ్యాడు. ఇటీవలే కోలుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2024 సిద్ధమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో లక్నో నేడు ఈ ఏడాది ఐపీఎల్‍లో వేట మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా కేఎల్ రాహుల్ తన గాయాలపై కామెంట్స్ చేశాడు.
దురదృష్టవశాత్తు రెండేళ్లుగా గాయాలు తనకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాయని కేఎల్ రాహుల్ అన్నాడు. “మళ్లీ మైదానంలోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా గాయాలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారాయి. కానీ అవి నన్ను మరింత ఆకలిగా (పరుగుల కోసం) మార్చాయి. తిరిగి వచ్చినప్పుడు మరింత అత్యుత్తమంగా రాణించేలా కసి పెరుగుతోంది” అని కేఎల్ రాహుల్ అన్నాడు.
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. ఈ పిచ్ బ్యాటింగ్‍కు బాగా సహకరించేలా కనిస్తోందని అన్నాడు.
లక్నో సూపర్‌జెయింట్స్ తుదిజట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దేవ్‍దత్ పడిక్కల్, ఆయుష్ బదోనీ, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహిసిన్ ఖాన్, నవీనుల్ హక్, యశ్ థాకూర్
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రన్ హిట్మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్
ఐపీఎల్ 2023 సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కాస్తలో ప్లే ఆఫ్స్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఐదో స్థానంలో సరిపెట్టుకుంది. లక్నో ప్లేఆఫ్స్ చేరినా.. ఫైనల్స్ వరకు వెళ్లలేకపోయింది. ప్లేఆఫ్స్ దశలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దీంతో ఈ ఐపీఎల్ 2024లో సత్తాచాటాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‍లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికయ్యే భారత జట్టులో చోటు దక్కించుకోవాలని కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ పట్టుదలగా ఉన్నారు.