MS Dhoni : ‘ధోనీ టీ20 వరల్డ్ కప్ ఆడాలి.. ఎంఎస్‌కి మించిన ప్లేయర్ ఎవరున్నారు?’
Virendra Sehwag on MS Dhoni : ఎంఎస్ ధోనీని టీ20 వరల్డ్‌లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్. ఒక ప్లాన్ కూడా చెప్పాడు.
T20 World Cup 2024 : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి చాలా కాలమైంది. అతను కేవలం ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ధోనీ బ్యాటింగ్, ఫీల్డ్‌లో అతని వికెట్ కీపింగ్ చూస్తుంటే అలా లేదు! తన కెమీయోలతో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు సీఎస్కే మాజీ కెప్టెన్. అందుకే.. త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ కూడా ఆడాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు. సెహ్వాగ్ మరో మెట్టెక్కి.. ఓ ప్లాన్ కూడా చెప్పాడు. ఆ ప్లాన్ ప్రకారం టీ20 వరల్డ్ కప్‌లో ధోనీని ఆడిస్తే.. టీమిండియా కచ్చితంగా ట్రోఫీని సాధిస్తుందని అంటున్నాడు.

'ధోనీని టీ20 వరల్డ్ కప్‌లో ఆడించాలి..'
టీ20 వరల్డ్ కప్‌లో ధోనీని ఆడించాలంటూ.. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్.
"ఈ ఐపీఎల్ 2024లో ధోనీ స్ట్రైక్ రేట్ 255గ ఉంది. ఔటే అవ్వలేదు కాబట్టి.. యావరేజ్ లేదు. 34 బాల్స్ ఆడి 87 రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ చూస్తే.. మనం ఎన్ని మంచి టీమ్స్ తలపడతాము? ఫస్ట్ రౌండ్లో ధోనీ పెద్దగా ఆడకపోవచ్చు. కేవలం కీపింగ్ చేయాలి. ఇప్పుడు సీఎస్కేకి ఎలాగో అదే చేస్తున్నాడు. ధోనీ.. కచ్చితంగా మూడు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కి దిగాలి. ఒకటి ఆస్ట్రేలియా, రెండు న్యూజిలాండ్, మూడు సౌతాఫ్రికా. పాకిస్థాన్ని కూడా లెక్కలో వేసుకుంటే.. నాలుగు టీమ్‌లు అవుతాయి. అది కూడా చివరి 3 ఓవర్లలో వచ్చి బ్యాటింగ్ చేయాలి. ఈ విషయంలో ధోనీకి మంచిన ప్లేయర్ ఎవరుంటారు?" అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2024 India squad : ధోనీ మళ్లీ బ్లూ జెర్సీ వేసుకుంటే.. ఇక ఫ్యాన్స్ సంతోషానికి కొదవుండదు. కానీ ధోనీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడటం జరగని పని! పైగా.. ఈ ఐపీఎల్ 2024లో అతని చివరి సీజన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ధోనీ మోకాలి నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడన్న విషయం మర్చిపోకూడదు.
టీ20 స్క్వాడ్‌లో ఆ స్థానం దక్కేది ఎవరికి?
టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రాలు కచ్చితంగా ఉంటారు. అయితే.. ఇక్కడ వికెట్ కీపర్ పొజీషన్కే టప్ ఫైట్ కనిపిస్తోంది. రిషభ్ పంత్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తిక్.. ఇలా రేసులో గట్టి పేర్లే ఉన్నారు.
T20 World Cup 2024 squad : మరీ ముఖ్యంగా.. ఆర్సీబీ బ్యాటర్, వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్.. తన ఫామ్‌తో అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. 38ఏళ్ల దినేశ్ కార్తిక్ కచ్చితంగా టీ20 వరల్డ్ కోసం వెళ్లే టీమిండియా జట్టులో ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన కార్తిక్.. 251 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 196.09గా ఉంది. యావరేజ్ 62.75. హయ్యెస్ట్ స్కోర్ 83.
మరి.. ఇంతటి టఫ్ ఫైట్‌లో.. టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం