IPL 2024 : 'ధోనీ కోపంలో హెల్మెట్ విసిరికొట్టాడు.. నేను ఎప్పుడు ఎంఎస్‌డీని అలా చూడలేదు'
ఐపీఎల్ 2014 సమయంలో ధోనీకి ఓసారి చాలా కోపం వచ్చిందని, తన హెల్మెట్‌ని విసిరిగొట్టాడని చెప్పాడు సురైశ్ రైనా. ధోనీని అంత కోపంగా ఎప్పుడు చూడలేదని అన్నాడు.
MS Dhoni angry : ప్రశాంతతకు మారుపేరు మహేంద్ర సింగ్ ధోనీ! మైదానంలో చాలా కామ్‌గా, కూల్‌గా ఉండే ధోనీకి.. ‘మిస్టర్ కూల్’ అని బిరుదు కూడా ఉంది. ధోనీకి కోపం చాలా అరుదు! అలాంటి ఒక అరుదైైన సందర్భాన్ని తాజాగా వెల్లడించాడు టీమిండియా మాజీ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేశ్ రైనా. ధోనీని అంత కోపంగా ఎప్పుడు చూడలేదని అన్నాడు.
‘ధోనీని ఎప్పుడు అంత కోపంగా చూడలేదు..’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2014 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నైని పంజాబ్ కింగ్స్ ఓడించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. 58 బంతుల్లో 122 పరుగులు చేయడంతో.. పంజాబ్ ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. రైనా 25 బంతుల్లో 87 పరుగులతో ఒంటిచేత్తో లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశాడు. ధోనీ 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. కానీ జట్టు గెలవలేకపోయింది. సీఎస్కే 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఓటమి తర్వాత ధోనీ తన హెల్మెట్, ప్యాడ్లను డ్రెస్సింగ్ రూమ్‌లో విసిరేశాడని, సీఎస్కే బ్యాటర్లు పరుగులు చేయకపోవడంపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడని రైనా వెల్లడించాడు.
ఇదీ చూడండి:- Gavaskar IPL 2024 : ‘బౌలర్లు అల్లాడిపోతున్నారు- బీసీసీఐ ఇప్పటికైనా..’
MS Dhoni IPL 2024 : "ధోనీ అంత కోపంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఆ విషయాన్ని మ్యాచ్ అనంతరం చెప్పాడు. 'మనం పరుగులు చేయం, మనం అది చేయం, ఇది చేయం' అన్నట్లు మాట్లాడాడు. తన ప్యాడ్లు, హెల్మెట్లను డ్రెస్సింగ్ రూమ్‌లో విసిరేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని చిరాకు పడ్డాడు. ఓడిపోకూడని మ్యాచ్‌లో ఓడిపోయామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. లేదంటే ఆ ఏడాది ఐపీఎల్ కూడా గెలిచేవాళ్లం,' అని రైనా చెప్పుకొచ్చాడు.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 సిక్సర్లు, 12 బౌండరీలతో 87 పరుగులు చేసిన సీఎస్కే మాజీ బ్యాటర్.. నాటి ఇన్నింగ్స్‌ని గుర్తు చేసుకున్నాడు.
Suresh Raina MS Dhoni : "ఎలాగైనా గెలవాలన్న మైండ్‌సెట్‌తో ఉన్నాను. ఏదైనా స్పెషల్‌గా చేస్తానని.. ముందు కలలు వచ్చాయి. నేను బంతిని ఫుట్‌బాల్ లాగా చూస్తున్నాను. నన్ను ఎవరూ ఆపలేరనే ఫీలింగ్ కలిగింది, కానీ, నేను రనౌట్ అయ్యాను.' అని రైనా చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం