Gavaskar IPL 2024 : ‘బౌలర్లు అల్లాడిపోతున్నారు- బీసీసీఐ ఇప్పటికైనా..’-gavaskars fiery message to bcci amid batting carnages in ipl 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar Ipl 2024 : ‘బౌలర్లు అల్లాడిపోతున్నారు- బీసీసీఐ ఇప్పటికైనా..’

Gavaskar IPL 2024 : ‘బౌలర్లు అల్లాడిపోతున్నారు- బీసీసీఐ ఇప్పటికైనా..’

Sharath Chitturi HT Telugu
Apr 21, 2024 04:30 PM IST

IPL 2024 latest news : ఐపీఎల్​2024లో బ్యాటర్ల విధ్వసంతో బౌలర్లు సఫర్​ అవుతున్నారని, కనీసం ఇప్పటికైనా బీసీసీఐ కొన్ని మార్పులు చేయాలని సూచించాడు సునీల్​ గవాస్కర్​. అవేంటంటే..

బీసీసీఐ అలా చేయకపోతే.. క్రికెట్​ బోర్​ కొట్టేస్తుంది!
బీసీసీఐ అలా చేయకపోతే.. క్రికెట్​ బోర్​ కొట్టేస్తుంది!

Sunil Gavaskar IPL 2024 : ఐపీఎల్​ 2024లో సిక్సర్ల మోత మోగిపోతోంది! కనీవినీ ఎరుగని రీతులో హయ్యెస్ట్​ స్కోర్లు నమోదవుతున్నాయి. బౌలర్ల మీద బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. ఈ సీజన్​లో జరిగిన మొదటి 35 మ్యాచుల్లో.. 200 స్కోరు ఏకంగా 15సార్లు దాటిందంటే.. బ్యాటర్ల విధ్వంసం, బౌలర్లపై వారి ఆధిపత్యం ఏ రేంజ్​లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటి మధ్య.. క్రికెట్​ లెజెండ్​ సునీల్​ గవస్కర్​ చేసిన కామెంట్స్​ ఇప్పుడు వార్తల్లోనిలిచాయి. బౌలర్లపై ప్రతికూల ప్రభావం పడుతోందని, బీసీసీఐ ఇప్పటికైనా తాను చెప్పిన విషయాన్ని అమలు చేసి వారిని రక్షించాలని సూచించారు.

'అలా చేయకపోతే.. బౌలర్ల పని అంతే!'

ఐపీఎల్​ 2024లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఎస్​ఆర్​హెచ్​ జట్టు ఎక్స్​ప్లోజివ్​ బ్యాటింగ్​ లైనప్​ దుమ్మురేపుతోంది. 15సార్లు 200 మార్క్​ దాటితే.. అందులో మూడు సార్లు ఎస్​ఆర్​హెచ్​యే చేసింది. ఇక శనివారం జరిగిన మ్యాచ్​లో కూడా ఎస్​ఆర్​హెచ్​ జట్టు విధ్వంసం కొనసాగింది. ఒకానొక దశలో దిల్లీ క్యాపిటల్స్​పై ఎస్​ఆర్​హెచ్​.. 300 దాటేస్తుందేమో అనిపించింది! చివరికి.. 20 ఓవర్లలో 266 రన్స్​ చేసింది.

వీటి మధ్య.. బీసీసీఐకి ఒక కీలక సూచన చేశాడు సునీల్​ గవాస్కర్​. బౌండరీ రోప్స్​ని కాస్త వెనక్కి జరపాలని సూచించాడు.

IPL 2024 latest news : "బౌండరీ రోప్స్​ని కాస్త వెనక్కి జరపొచ్చు. చిన్న మైదానాల్లో ఇలా కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అడ్వర్టైజింగ్​ బోర్డులు.. రోప్స్​కి మధ్యలో చాలా గ్యాప్​ ఉంటోంది కదా. దానిని తగ్గించాలి," అని చెప్పుకొచ్చాడు సునీల్​ గవాస్కర్​.

ఇదీ చూడండి:- IPL Commentary: జీరో నాలెడ్జ్‌తో ఐపీఎల్ కామెంటేటర్ అయిన హీరో.. స్ఫూర్తినిచ్చేలా కారణం!

"క్రికెట్​ బ్యాట్​లో మార్పులు చేయాలని నేను చెప్పను. అన్నీ.. రెగ్యులేషన్స్​ పరిధిలోనే ఉన్నాయి. కానీ.. బౌండరీ సైజులను కాస్త వెనక్కి జరపాలి. ఈ విషయాన్ని నేను చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాను. శనివారం జరిగిన దిల్లీ గ్రౌండ్​నే చూడండి. కొన్ని మీటర్ల వరకు వెనక్కి జరిపేంత స్పేస్​ ఉంది. ఈ కొంత స్పేస్​ చాలా కీలకం. బాల్​ని క్యాచ్​ పడతారా? లేక అది 6 వెళుతుందా? అనేది నిర్దేశిస్తుంది. ఎల్​ఈడీ యాడ్ బోర్డ్​ని ఇంకాస్త వెనక్కి జరపొచ్చు. బౌండరీ రోప్​ని కూడా 2-3 మీటర్లు వెనక్కి జరపొచ్చు. డిఫరెన్స్​ అంతా ఇక్కడే ఉంది," అని అన్నాడు క్రికెట్​ లెజండ్​.

SRH vs DC highlights : "పవర్​ హిట్టింగ్​తో ఇప్పుడు టీ20 క్రికెట్​ చాలా జోష్​ని ఇస్తుండొచ్చు. కానీ బ్యాటర్లు ఇలాగే కొట్టుకుంటూ వెళిపోతే కష్టమే! బౌలింగ్​- బ్యాటింగ్​ మధ్య పోటీ లేకపోతే.. క్రికెట్​ బోర్​ కొట్టేస్తుంది," అని అన్నాడు సునీల్​ గవాస్కర్.

"'ఇదే చివరి రౌండ్​.. కొడితే ఇప్పుడే కొట్టాలి' అని బ్యాటర్లకు కోచ్​లు చెబుతున్నట్టు ఉంది పరిస్థితి. బ్యాట్​ని ఇష్టమొచ్చినట్టు తిప్పేస్తున్నారు. ఔట్​, నాటౌట్​ని పట్టించుకోవడం లేదు. కొంత వరకు సంతోషించొచ్చు. కానీ ఆ తర్వాత.. బోర్​ కొట్టేస్తుంది," అని సునీల్​ గవాస్కర్​ చెప్పాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం