SRH vs DC: సన్‍రైజర్స్ సృష్టించిన నయా రికార్డులు ఇవే
Photo: AFP
By Chatakonda Krishna Prakash Apr 20, 2024
Hindustan Times Telugu
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో నేటి (ఏప్రిల్ 20) మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపటంతో పాటు కొన్ని రికార్డులను సృష్టించింది.
Photo: PTI
ఐపీఎల్‍లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‍లో 5 ఓవర్లలోనే 103 రన్స్ చేసి ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది.
Photo: PTI
టీ20 చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును హైదరాబాద్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‍లో ఆరు ఓవర్లలో 125 రన్స్ చేసి ఈ చరిత్ర క్రియేట్ చేసింది.
Photo: ANI
ఐపీఎల్‍లో తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోరు రికార్డును కూడా ఎస్ఆర్‌హెచ్ సృష్టించింది. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‍లో తొలి పది ఓవర్లలోనే హైదరాబాద్ 158 రన్స్ చేసింది.
Photo: PTI
ఐపీఎల్‍లో మూడుసార్లు 250కు పైగా రన్స్ చేసిన తొలి జట్టుగా హైదరాబాద్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్‍లోనే 277 రన్స్ (ముంబైపై), 287 పరుగులు (బెంగళూరుపై) చేసింది సన్‍రైజర్స్. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డును కూడా ఈ సీజన్‍లోనే నమోదు చేసింది.
Photo: PTI
ఐపీఎల్‍లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన రెండో జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఈ మ్యాచ్‍లో 14.4 ఓవర్లలోనే 200 మార్క్ దాటింది. ఐపీఎల్‍లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల (22) తన రికార్డు మరోసారి సమం చేసింది హైదరాబాద్.
Photo: PTI
ట్రావిస్ హెడ్ (89), అభిషేక్ శర్మ (46), షహబాజ్ అహ్మద్ (59 నాటౌట్) విజృభించడంతో ఢిల్లీతో మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లకు 266 పరుగులు చేసింది.
Photo: AFP
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి