AB de villiers on Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. డివిలియర్స్ సమాధానం వింటే మళ్లీ ఈ ప్రశ్న అడగరు-dhoni is a diesel engine that never ends says ab de villiers when asked is this the last ipl season for msd ipl news ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ab De Villiers On Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. డివిలియర్స్ సమాధానం వింటే మళ్లీ ఈ ప్రశ్న అడగరు

AB de villiers on Dhoni: ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. డివిలియర్స్ సమాధానం వింటే మళ్లీ ఈ ప్రశ్న అడగరు

Hari Prasad S HT Telugu
Published Mar 14, 2024 08:18 PM IST

AB de villiers on Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా? ఈ ప్రశ్నకు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇచ్చిన సమాధానం చూస్తే ఇక ఎవరూ మరోసారి ఈ ప్రశ్న అడగరు.

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. డివిలియర్స్ సమాధానం వింటే మళ్లీ ఈ ప్రశ్న అడగరు
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా.. డివిలియర్స్ సమాధానం వింటే మళ్లీ ఈ ప్రశ్న అడగరు

AB de villiers on Dhoni: ధోనీ తన చివరి ఐపీఎల్ ఆడబోతున్నాడా.. గత మూడు సీజన్లుగా ప్రతిసారీ ఇదే ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఈ ప్రశ్నకు ధోనీ మాత్రమే సమాధానం చెప్పాల్సింది. కానీ అతడు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే తాజాగా ఈ ప్రశ్నపై సౌతాఫ్రికా, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. అతడు ఏమన్నాడంటే..

ధోనీ ఓ డీజిల్ ఇంజిన్

ఈ సీజన్ తర్వాత కూడా ధోనీ రిటైర్ కాకపోవచ్చని డివిలియర్స్ అన్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు. "గతేడాది వాళ్లు అద్భుతమైన క్రికెట్ ఆడారు. గతేడాదే ధోనీ రిటైర్ అవుతాడని పుకార్లు వచ్చాయి. కానీ అలా జరగలేదు. అతడు మళ్లీ వస్తున్నాడు. ఈసారి అతనికి చివరి సీజన్ అవుతుందా? ఎవరికీ తెలియదు. ఎప్పటికీ ముగిసిపోని ఓ డీజిల్ ఇంజిన్ లా అతడు కనిపిస్తున్నాడు. అతడు పరుగెత్తుతూనే ఉన్నాడు. అతడో అద్భుతమైన ప్లేయర్, అద్భుతమైన కెప్టెన్" అని డివిలియర్స్ అన్నాడు.

ఇక సీఎస్కే టీమ్ కల్చర్ గురించి కూడా డివిలియర్స్ స్పందించాడు. "చెన్నై సూపర్ కింగ్స్ ఈ అద్భుతమైన కల్చర్ వాళ్ల ఉనికి ద్వారా, వాళ్ల కెప్టెన్ ధోనీ ద్వారా, వాళ్ల కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ద్వారా, రవీంద్ర జడేజాలాంటి సీనియర్ ప్లేయర్స్ ద్వారా కొనసాగుతూనే ఉంది. వాళ్ల టీమ్ తో ఆడాలంటే భయమేస్తుంది. వాళ్లను ఓడించడం ఎప్పుడూ సులువు కాదు" అని ఏబీ అన్నాడు.

సీఎస్కే అందుకే డేంజర్

సీఎస్కే టీమ్ పై, ధోనీపై ఈసారి ఎలాంటి ఒత్తిడి లేదని, అదే ఆ జట్టును మరింత ప్రమాదకరంగా మారుస్తుందని డివిలియర్స్ అన్నాడు. వాళ్లు ఏదో ఒక రకంగా గెలుపు బాట పట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నారని అతడు చెప్పాడు. "విజయవంతమైన జట్టు, విజయవంతమైన ఫ్రాంఛైజ్ గొప్ప లక్షణం ఇదే. బాగా ఆడుతున్నప్పుడు ఎవరూ అడ్డుకోలేరు.

కానీ అంత బాగా ఆడటం లేనప్పుడు కూడా గట్టి పోటీ ఇచ్చే మార్గం వాళ్లు కనుక్కొంటారు. గతేడాది సీఎస్కే గెలిచింది. వాళ్లు టైటిల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎమ్మెస్డీ మీద, అతని టీమ్ మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఇదే వాళ్లను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. వరుసగా రెండో టైటిల్ గెలుస్తారా? వాళ్లకు కచ్చితంగా ఆ సామర్థ్యం ఉంది" అని డివిలియర్స్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే జరగనుంది. ఈ కొత్త సీజన్ కోసం మార్చి తొలి వారంలోనే ధోనీ చెన్నై చేరుకున్నాడు. అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. మరోసారి అతడు ఈ సీజన్లో పొడవాటి జుట్టుతో కనిపించనుండటం విశేషం. ఇక గతేడాది మోకాలి సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న ధోనీ.. ఈసారి ఏం చేస్తాడో చూడాలి.

Whats_app_banner