How to make money in stock market : స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం ఎలా?-here are the tips on how to make money in stock market ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Make Money In Stock Market : స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం ఎలా?

How to make money in stock market : స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం ఎలా?

Sharath Chitturi HT Telugu
Oct 11, 2022 01:54 PM IST

How to make money in stock market : స్టాక్​ మార్కెట్​లో రూ. కోట్లు సంపాదించాలని మీరు కలలు కంటున్నారా? ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కడం లేదా? అయితే ఇది మీ కోసమే.

స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం ఎలా?
స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం ఎలా? (AP)

How to make money in stock market : స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కానీ సంపాదించడం మాట పక్కనపెడితే.. చాలా మంది డబ్బులు పొగొట్టుకుంటారు. ఆ తర్వాత తిరిగి మార్కెట్లవైపు చూడరు. స్టాక్​ మార్కెట్​ను ఒక గ్యాంబ్లింగ్​లాగా చూస్తారు. వాస్తవానికి.. స్టాక్​ మార్కెట్​ నుంచి డబ్బులు సంపాదించడం కష్టమే.. కానీ 'అసాధ్యం' కాదు! స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ సాధించిన ఎందరో ఇందుకు నిదర్శనం. మరి స్టాక్​ మార్కెట్​ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి? మనం ఎలాంటి తప్పులు చేయకూడదు?

మన గురించి మనం తెలుసుకోవాలి..

స్టాక్​ మార్కెట్​ని.. డబ్బులు ఇచ్చే యంత్రంగా చూడటం మానుకోవాలి. స్టాక్​ మార్కెట్​లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు అన్న విషయం జీర్ణించుకోవాలి. అందరం డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగంలో చేరి డబ్బులు సంపాదిస్తాము. కానీ స్టాక్​ మార్కెట్​ విషయానికొచ్చే సరికి వెంటనే, వేగంగా డబ్బులు వచ్చేయాలని చూస్తుంటాము. ఈ సైకాలజీ తప్పు! మార్కెట్​లో నిలదొక్కుకోవాలంటే.. జ్ఞానం చాలా ముఖ్యం. దానికి మించి.. సైకాలజీ చాలా కీలకం.

Stock market investment : స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వడం ఓ జర్నీతో సమానం. ఈ జర్నీలో ఎన్నో నష్టాలు ఉంటాయి. ఎన్నో లాభాలు ఉంటాయి. ఈ జర్నీలో ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరు? మనకి స్టాక్​ మార్కెట్​లో ఏ స్ట్రాటజీ సూట్​ అవుతోంది? నష్టాల వెనక మన తప్పులు, సైకాలజీలో లోపాలు ఏమైనా ఉన్నాయా? లేక మార్కెట్​ ఒడుదొడుకుల్లో మనం డబ్బులు కోల్పోయామా? అన్నది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి టైమ్​ పడుతుంది. ఆ టైమ్​లో డబ్బులు పోగొట్టుకోకుండా మార్కెట్​లో నిలబడాలి. క్యాపిటల్​ పూర్తిగా నష్టపోతే.. రేపు అనే రోజున మార్కెట్​లో ఉండటమే కష్టం.

మనకి ఫండమెంటల్​ ఎనాలిస్​తో చేసే ఇన్​వెస్ట్​మెంట్​ నప్పుతోందా? లేదా టెక్నికల్​ ఎనాలసిస్​తో చేసే ట్రేడింగ్​ మనకి లాభాలనిస్తోందా? అన్నది ట్రై చేయాలి. ప్రయోగాలు చేసి తెలుసుకోవాలి. స్టాక్​ మార్కెట్​లో మనకి మనతోనే పోటీ. మనకి మనమే పోటీ..! అందుకే సైకాలజీని మెరుగుపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి.

గుంపులో గోవింద పనులు వద్దు..!

Stock market trading : స్టాక్​ మార్కెట్​లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. చాలా మంది మనల్ని ట్రాప్​ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో.. మనమే అత్యాసకు పోయి.. టిప్స్​ కోసం ప్రయత్నిస్తూ ఉంటాము. డబ్బులు కట్టి టిప్స్​ తీసుకుని ట్రై చేస్తూ ఉంటాము. ఇది ఒక రకంగా మంచిది కాదు. వాళ్లు ఇచ్చే టిప్స్​ మన సైకాలజీకి సెట్​ అవ్వకపోవచ్చు. ఎవరో చెప్పారు కదా అని మనం స్టాక్స్​ని బై, సెల్​ చేయకూడదు. ఒక స్టాక్​ని కొనాలన్నా, అమ్మాలన్నా.. దాని వెనక చాలా రీసెర్చ్​ చేయాల్సి ఉంటుంది. అందుకే గుంపులో గోవిందా.. లాగా కాకుండా మనకుంటూ సొంతంగా సెటప్​ ఉంటే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది.

స్టాక్​ మార్కెట్​ టైమింగ్​..

స్టాక్​ మార్కెట్​లో చాలా మంది చేసే తప్పు 'టైమింగ్​'. మార్కెట్​లను టైమ్​ చేయాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అది అస్సలు జరగని పని! కొన్ని సందర్భాల్లో లక్​ వల్ల మార్కెట్​ను టైమ్​ చేయగలమేమో కానీ.. అన్నిసార్లు అలా జరగదు. అందుకే మార్కెట్​ను టైమ్​ చేయకుండా.. దానితో పాటు ప్రయాణించాలి. లాస్​లు తీసుకోవాలి. ప్రాఫిట్​లను చూడాలి.

Stock market news today : మార్కెట్​ను టైమ్​ చేసే క్రమంలో.. మంచి ఎంట్రీ పాయింట్​ కోసం వెతుకుతూ ఉంటాము. ఒక్కోసారి ఆ టైమ్​ రాకపోవచ్చు! ఎదురుచూపులు ఫలించకపోవచ్చు. ఇవన్నీ కాకుండా.. మార్కెట్​తో పాటు జర్నీ చేయడాన్ని నేర్చుకోవాలి. ఈ జర్నీలో స్టాక్​ మార్కెట్​ మనకి చాలా నేర్పిస్తుంది.

క్రమశిక్షణ..

స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ అవ్వాలంటే క్రమ శిక్షణ చాలా అవసరం. మార్కెట్​కు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు యాక్టివ్​గా ఉండాలో తెలుసుకోవాలి. దూరంగా ఉండాల్సిన సమయం అని తెలిసి కూడా యాక్టివ్​గా ఉంటే.. కఠిన శిక్ష పడటం తప్పదు.

అందుకే రెగ్యులర్​గా ఇన్​వెస్ట్​మెంట్​ చేస్తూ ఉండాలి. దీర్ఘకాల ప్రణాళికలు ఉంటే.. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అప్పుడు ఒడిదొడుకులను జయించవచ్చు. దీర్ఘకాలంలో హోల్డ్​ చేసిన మంచి స్టాక్స్​తో అద్భుతంగా రిటర్నులు సాధించివారు ఎందరో ఉన్నారు.

ఎమోషన్స్​ వద్దు.. సైకాలజీ ముద్దు.

Stock market psychology : ఎమోషన్స్​పై కంట్రోల్​ లేకపోతే స్టాక్​ మార్కెట్​లో ఎక్కువ కాలం నిలబడటం చాలా కష్టం! లాజికల్​గా ఆలోచించాల్సిన చోట.. ఎమోషనల్​గా ఆలోచించి తప్పులు చేస్తూ ఉంటారు. స్టాక్​ మార్కెట్​లో ఎమోషన్స్​కు స్థానం లేదు. లాస్​ వస్తే అంగీకరించాల్సిందే. లాభాలొస్తే.. ప్రశాంతంగా ఉండాల్సిందే.

చివరిగా.. మార్కెట్​తో జర్నీ చేస్తే.. ఆ మార్కెటే చాలా నేర్పిస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశయంతో స్టాక్​ మార్కెట్​లోకి రాకూడదు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ.. ఒడిదొడుకులతో ముందుకెళుతూ ఉంటే.. మీ సక్సెస్​ జర్నీ నలుగురికి స్ఫూర్తినిస్తుంది. లేదంటే.. ఫెయిల్​ అయిన కథలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి!

సంబంధిత కథనం