'ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్' నుంచి ఇన్వెస్ట్‌మెంట్ లెసన్స్
- ఫైనాన్షియల్ స్కామ్‌లు నిస్సందేహంగా సర్వత్రా ఉన్నాయి. కొన్ని కుంభకోణాలు సినిమాలుగా తెరకెక్కించేంత పెద్దవి. ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మూవీ అలాంటి స్కామ్‌ను వివరిస్తుంది. అయితే చిన్న పెట్టుబడిదారులకు అనేక విలువైన పాఠాలను కూడా ఈ హాలీవుడ్ మూవీ అందిస్తుంది.
- ఫైనాన్షియల్ స్కామ్‌లు నిస్సందేహంగా సర్వత్రా ఉన్నాయి. కొన్ని కుంభకోణాలు సినిమాలుగా తెరకెక్కించేంత పెద్దవి. ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ మూవీ అలాంటి స్కామ్‌ను వివరిస్తుంది. అయితే చిన్న పెట్టుబడిదారులకు అనేక విలువైన పాఠాలను కూడా ఈ హాలీవుడ్ మూవీ అందిస్తుంది.
(1 / 5)
వైట్ కాలర్ ప్రొఫెషనల్ చేసే క్లెయింను విశ్వసించకూడదు: ఈ మూవీలో జోర్డాన్ బెల్ ఫోర్ట్ తన సిబ్బందికి ఏం చెబుతాడంటే.. వారిని స్ట్రాటన్ ఓక్‌మాంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా పరిచయం చేసుకుని క్లయింట్లతో మాట్లాడాలని సూచిస్తాడు. కాలర్స్ బాగా ఉన్నత విద్యావంతులైన ప్రొఫెషనల్స్‌గా చిత్రించేందుకు ఇదొక వ్యూహం. అయితే బ్రోకరేజ్ హౌజ్‌లో ఒక ఫ్యాన్సీ డిజిగ్నేషన్ ఉన్నంత మాత్రాన అతడి విశ్వసనీయత పెరగదు.
(2 / 5)
ఫలానా స్టాక్ కొనుగోలుచేయాలని బ్రోకరేజ్ హౌజ్ నుంచి కాల్ వస్తుంది. దానికి బలం చేకూర్చేలా వారు అనేక కారణాలు చెబుతారు. అంతమాత్రాన ఆ స్టాక్ కొనరాదు. మీ సొంత పరిశోధన చేసిన తరువాత షేర్లు కొనుగోలు చేయాలి. ఆ కంపెనీ బలమైన ఫండమెంటల్స్ కలిగి ఉందని విశ్వసించాకే మీరు ఆ స్టాక్ కొనుగోలు చేయాలి.
(3 / 5)
రిస్కీ స్టాక్‌లలో ఎక్కువ డబ్బు పెట్టవద్దు: జోర్డాన్ బెల్‌ఫోర్ట్ బాధితులు స్ట్రాటన్ ఓక్‌మాంట్ చేసిన వాగ్దానాల ఆధారంగా తాము జీవిత కాలంలో చేసిన పొదుపు మొత్తాన్ని నిర్ధిష్ట షేర్లలో పెట్టుబడులు పెడతారు. దీని వల్ల ఆర్థికంగా, మానసికంగా తీవ్ర వేదనకు గురవుతారు. స్టాక్ ఎంత బాగా కనిపించినా తమ మొత్తం పెట్టుబడిని ఒకటి రెండు స్టాక్స్‌లో పెట్టరాదు. భిన్నత్వాన్ని ఎంచుకోవాలి.
(4 / 5)
నిపుణుల నుండి సలహా ఎల్లప్పుడూ చెడ్డది కాదు: సినిమా చూసిన తర్వాత ప్రతి బ్రోకర్‌ను అనుమానంతో చూసే అవకాశం ఉంది. కానీ కొంతమంది మోసగాళ్ల కారణంగా, స్టాక్ బ్రోకర్లందరినీ అపనమ్మకంగా చూడరాదు. సెబీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు చాలా మంది ఉన్నారు. సందేహం ఉన్నట్లయితే, ఒకటి కంటే ఎక్కువ మంది బ్రోకర్ల నుండి సలహా తీసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు