Croma Diwali Sale : ఐఫోన్, యాపిల్ వాచ్‌పై అదిరిపోయే ఆఫర్స్!
Croma Diwali Sale : దేశ ప్రజలను మరో ఫెస్టివల్ సేల్ పలకరించేసింది! దీపావళి సేల్‌ను ప్రకటించింది క్రోమా. ఈ క్రమంలో ఐఫోన్ 13తో పాటు ఇతర యాపిల్ ప్రాడక్టులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ఇచ్చింది. ఆ వివరాలు..
Croma Diwali Sale : దీపావళి ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది 'క్రోమా'. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ క్రమంలో ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్.. ఆన్లైన్లో అత్యంత కనిష్ఠ ధరకు అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయలేకపోయిన వారు.. క్రోమా దీపావళి ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 13ని దక్కించుకోవచ్చు!

క్రోమా వెబ్‌సైట్‌లోని టీజర్ ప్రకారం.. ఐఫోన్ 13 ధర రూ. 51,990గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 69,900. అంటే.. ఐఫోన్ 13పై ఏకంగా రూ. 17,910 తగ్గినట్టు. అయితే.. ఈ డీల్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేదు. క్రోమా వెబ్ పేజ్ ప్రకారం.. ఈ డీల్ ఈ రోజు సాయంత్రం 4:45 గంటలకు లైవ్‌లోకి వెళ్లనుంది. బ్యాంక్ కార్డులు, ప్రీపెయిడ్ ఆర్డర్లు, ఫ్లాట్ డిస్కౌంట్ల ఆప్షన్లతో ఐఫోన్ 13 ధరల్లో మార్పులు చూడవచ్చు.
Croma Diwali Sale offers : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ. 57,900గా ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో రూ. 16,900 తగ్గుతుంది. కాగా.. అమెజాన్‌లో ఐఫోన్ 12 ధర రూ. 42,999గా ఉంది.
ఇక క్రోమా దీపావళి సేల్‌లో యాపిల్ ఎస్ఈ కూడా డిస్కౌంట్ ధరకు లభించనుంది. రూ. 19,990కి ఈ స్మార్ట్‌వాచ్‌ను దక్కించుకోవచ్చు. ఇక శాంసంగ్ గ్యాలెక్సీ ఎఫ్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 26,999కి కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ టీవీ వన్‌ప్లస్ ధర రూ. 19,999గా ఉండటం విశేషం.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపో 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇవి కొన్ని ఎంపిక చేసిన ప్రాడక్టులపైనే ఉండొచ్చు. పూర్తి వివరాల కోసం క్రోమా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Apple Diwali sale : యాపిల్ కూడా..
కొన్ని రోజుల క్రితమే యాపిల్ ఇండియా కూడా దీపావళి సేల్‌ను ప్రకటించింది. యాపిల్ ఇండియా స్టోర్ టీజర్ ప్రకారం.. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఈ నెల 26న మొదలైంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం