Apple India Diwali sale : యాపిల్ ఇండియా దీపావళి సేల్ వచ్చేస్తోంది..
Apple India Diwali sale announced : యాపిల్ ఇండియా.. ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. ఆ వివరాల కోసం ఈ కథనం చూడండి.
Apple India Diwali sale announced : ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది యాపిల్ సంస్థ. యాపిల్ ఇండియా స్టోర్ టీజర్ ప్రకారం.. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఈ నెల 26న మొదలవుతుంది. ఈ సేల్‌లో కనిపించే డీల్స్, ఆఫర్స్‌పై యాపిల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఐఫోన్ కొనుగోళ్లపై ఉచిత గిఫ్ట్‌లను యాపిల్ ఇచ్చే అవకాశం ఉంది.
గతేడాది ఇలాంటి ఫెస్టివల్ సేల్‌నే నిర్వహించింది యాపిల్ ఇండియా. అప్పుడు.. ఫ్రీ గిఫ్ట్‌ల కింద ఎయిర్‌పాడ్స్ ఇచ్చింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ కొనుగోలు చేసిన వారికి ఈ ఎయిర్‌పాడ్స్ ఫ్రీగా ఇచ్చింది. ఈసారి.. ఐఫోన్ 13 కొంటే ఫ్రీ గిఫ్ట్‌గా ఎయిర్‌పాడ్స్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు మరిన్ని ఆకర్షణీయమైన ప్రాడక్టులు సేల్‌కి వచ్చే అవకాశం లేకపోలేదు.
అతి తక్కువ ధరలకు యాపిల్ ఐఫోన్ కొనాలని ఉందా?
Apple India Diwali sale 2022 : యాపిల్ ఐఫోన్ 13ని గతేడాదిలో లాంచ్ చేశారు. అప్పట్లో దాని ధర రూ. 79,900గా ఉండేది. తాజగా.. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్‌తో ఐఫోన్ 13 ధర రూ. 69,900కి పడిపోయింది. ఇక ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ నడుస్తున్నాయి. ఈ రెండింట్లోనూ.. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్లే లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,990కే ఐఫోన్ 13 వస్తోంది. దీనిపై ఎక్స్ఛైంజ్ ఆఫర్(రూ. 16,900) కూడా ఉంది. వీటికి తోడు.. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండే 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తోంది.
Apple iPhone : అదే విధంగా ఐపోన్ 12 64జీబీ వేరియంట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 42,999కి ఉంది. ఎస్బీఐ క్రెడిట్- డెబిట్ కార్డులు ఉంటే మరింత సేవ్ చసుకోవచ్చు. అదనంగా రూ. 3వేల ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్ 12 ధర రూ. 39,999కే లభించే అవకాశం ఉంది.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ రెండూ ఈ నెల 23నే ప్రారంభమయ్యయి.
సంబంధిత కథనం