Amazon Great Indian Festival Sale : అమెజాన్​​ ఫెస్టివల్​ సేల్​ షురూ.. ఇక మొదలుపెడదామా?-amazon great indian festival sale 2022 kicks off today know best offers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Amazon Great Indian Festival Sale 2022 Kicks Off Today Know Best Offers

Amazon Great Indian Festival Sale : అమెజాన్​​ ఫెస్టివల్​ సేల్​ షురూ.. ఇక మొదలుపెడదామా?

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 08:12 AM IST

Amazon Great Indian Festival Sale today : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ ప్రారంభమైంది. అదిరిపోయే ఈ ఆఫర్స్​, డిస్కౌంట్స్​పై ఓ లుక్కేయండి..

అమెజాన్​​ ఫెస్టివల్​ సేల్​ షురూ..
అమెజాన్​​ ఫెస్టివల్​ సేల్​ షురూ..

Amazon Great Indian Festival Sale today : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ శుక్రవారం మొదలైంది. ఆకర్షణీయమైన ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది అమెజాన్​. వీటిల్లో కొన్ని ప్రాడక్టులను మీకోసం ప్రత్యేకంగా ఎంపిక చేశాము. మీరు ఓ లుక్కేయండి.

ట్రెండింగ్ వార్తలు

Apple iPhone 12 offers..

Amazon offers on iPhones : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో ఐఫోన్​ 12 64జీబీ వేరియంట్​ రూ. 44,499కే లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 65,900 ఎస్​బీఐ క్రెడిట్​/డెబిట్​ కార్డుల మీద రూ. 3వేల వరకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఫలితంగా ఐఫోన్​ 12 ధర మరింత తగ్గుతుంది. పాత స్మార్ట్​ఫోన్​ని ఎక్స్​ఛేంజ్​ చేస్తే.. రూ. 14,350 ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ కూడా వస్తుంది.

Samsung Galaxy S22 5G..

ఈ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో శాంసంగ్​ గ్యాలెక్సీ ఎస్​ 22 5జీ.. రూ. 52,999కే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 85,999 కావడం గమనార్హం. వీటితో పాటు రూ. 14,300 వరకు డిస్కౌంట్​, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు మీద రూ. 1,500 అదనపు డిస్కౌంట్​ లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​పై నో కాస్ట్​ ఈఎంఐ కూడా ఇస్తోంది అమెజాన్​.

Oneplus Nord CE 2 Lite..

Amazon great Indian festival sale 2022 : ఈసారి అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 లైట్​ రూ. 18,499కే లభిస్తోంది. రూ. 20వేలలోపు మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని భావిస్తున్న వారికి ఇది మంచి ఛాయిస్​ అవుతుంది. రూ. 500 అదనపు డిస్కౌంట్​ కోసం ప్రాడక్ట్​ పేజీలో ఉన్న కూపాన్​ను వాడుకోవాలి. పాత స్మార్ట్​ఫోన్​ ఎక్స్​ఛేంజీతో రూ. 14,300 ఇన్​స్టెంట్​ డిస్కౌంట్​ కూడా లభిస్తుంది.

Samsung Galaxy M13...

శాంసంగ్​ గ్యాలెక్సీ ఎం 13.. ఈ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో రూ. 9,499కే వచ్చేస్తోంది. దీని వాస్తవ ధర రూ. 14,999. ఇందులోనూ ఎన్నో డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్లు ఉన్నాయి.

Apple watch SE..

Amazon offers on Apple watch : యాపిల్​ వాచ్​ ఎస్​ఈ వాస్తవ ధర రూ. 33,900. కానీ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో ఈ వాచ్​ ధర రూ. 27,900గా ఉంది. నో కాస్ట్​ ఈఎంఐ కూడా లభిస్తోంది.

Sony WH 1000XM4 wireless headphones..

అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో సోనీ డబ్ల్యూహెచ్​ 1000ఎక్స్​ఎం4 హెడఫోన్స్​.. రూ. 19,990కే వస్తోంది. దీని వాస్తవ ధర రూ. 29,990. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు ఉంటే.. ఈ హెడ్​ఫోన్స్​ రూ. 16,200కే వచ్చేస్తుంది.

Apple Mac mini with M1..

యాపిల్​ మ్యాక్​ మినీ ఎం 1(2020 మోడల్​).. వాస్తవ ధర రూ. 64,900గా ఉండగా.. అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​తో అది రూ. 58,990కే వస్తోంది. ఎస్​బీఐ క్రెడిట్​ కార్డు మీద రూ. 1,500 డిస్కౌంట్​ కూడా లభిస్తోంది.

Fire TV stick..

Amazon fire stick cost : ఫైర్​ టీవీ స్టిక్​.. రూ. 4999గా ఉండేది. కానీ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో అది రూ. 1,999కే లభిస్తోంది. 4కే మోడల్​ గతంలో రూ. 5,999గా ఉంటే.. ఇప్పుడది రూ. 2,999కి లభిస్తోంది.

అమెజాన్​ ప్రైమ్​ యూజర్లకు ఈ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​.. గురువారమే ప్రారంభమైంది.

ఇక ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ కూడా ఈరోజునే ప్రారంభమైంది. ఇక యూజర్లకు పండగే!

IPL_Entry_Point

సంబంధిత కథనం