Flipkart Big Billion Days : సూపర్​ 'డీల్స్​'.. రూ. 30వేలల్లోపు వచ్చే స్మార్ట్​ఫోన్స్​ ఇవే-flipkart big billion days best deals on smartphones under rs 30000 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Flipkart Big Billion Days: Best Deals On Smartphones Under <Span Class='webrupee'>₹</span>30,000

Flipkart Big Billion Days : సూపర్​ 'డీల్స్​'.. రూ. 30వేలల్లోపు వచ్చే స్మార్ట్​ఫోన్స్​ ఇవే

Sharath Chitturi HT Telugu
Sep 18, 2022 01:34 PM IST

Flipkart Big Billion Days offers on smartphones : ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్స్​ ఇస్తున్నారు. ఫలితంగా రూ. 30వేలల్లోపు అందుబాటులోకి వచ్చే స్మార్ట్​ఫోన్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ ఆఫర్స్​
ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ ఆఫర్స్​ (Flipkart)

Flipkart Big Billion Days offers on smartphones : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​కు మరికొన్ని రోజులే ఉంది. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 30 వరకు ఈ ఫెస్టివల్​ సేల్​ జరగనుంది. స్మార్ట్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​, హోం అప్లయన్సెస్​తో పాటు అనేక ఎలక్ట్రానిక్​ పరికరాలపై క్రేజీ డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో రూ.30,000లోపు అందుబాటులో ఉండే స్మార్ట్​ఫోన్స్​పై ఓ లుక్కేద్దాం..

ట్రెండింగ్ వార్తలు

నథింగ్​ ఫోన్​(1)..

ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో నథింగ్​ ఫోన్​(1) రూ. 28,999 నుంచి ప్రారంభంకానుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో గ్లింఫ్​ ఇంటర్​ఫేస్​ ఉండనుంది. క్వాల్కం స్మాప్​డ్రాగన్​ 778జీ+ ఆక్టా కోర్​ ప్రాసెసర్​ దీని సొంతం. ఇందులో 6.55 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. దీని బ్యాటరీ పవర్​ 4,500ఎంఏహెచ్​.

గూగుల్​ పిక్సెల్​ 6ఏ..

Flipkart Big Billion Days sale : ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో గూగుల్​ పిక్సెల్​ 6ఏ.. రూ. 27,699 నుంచి అందుబాటులోకి రానుంది. టెన్సర్​ చిప్​సెట్​తో పాటు 128జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ కెపాసిటీ దీని సొంతం. ఇందులో ఫ్రంట్​ కెమెరా 8ఎంపీగా ఉంది. ఇక రేర్​లో 12ఎంపీ కెమెరా ఉంటుంది.

ఒప్పో రెనో 8 5జీ..

ఈ ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో ఒప్పో రెనో 8 5జీ రూ. 26,999కి అందుబాటులో ఉండనుంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్​ ఉంటుంది. 32ఎంపీ సెల్ఫీ కెమెరా, 80డబ్ల్యూ సూపర్​వీఓఓసీ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ దీని సొంతం. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500ఎంఏహెచ్​. 6.43ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లేతో వస్తోంది.

మోటోరోలా ఎడ్జ్​ 30 5జీ..

Flipkart Big Billion Days sale smart phone offers : ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో మోటోరోలా ఎడ్జ్​ 30 5జీ.. రూ. 22,749కి వస్తోంది. ఇందులో 6.55ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ అమోలెడ్​ డిస్​ప్లే, 144హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంటుంది. క్వాల్కం స్మాప్​డ్రాగన్​ 778ప్లస్​ ప్రాసెసర్​ దీని సొంతం. రేర్​లో ట్రిపుల్​ కెమెరా(50ఎంపీ, 50ఎంపీ, 2ఎంపీ) ఉండనుంది. ఇక సెల్ఫీ కెమెరాకి 32ఎంపీ ఇచ్చారు.

రియల్​మీ జీటీ 2

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో రియల్​మీ జీటీ 2 రూ. 26,999గా ఉంది. క్వాల్కం స్మాప్​డ్రాగన్​ 888 ప్రాసెసర్​, 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. 6.62 ఇంచ్​ స్క్రీన్​, 16ఎంపీ ఫ్రంట్​ కెమెరా దీనిలో ఉన్నాయి.

వీటితో పాటు ఇంకా అనేక స్మార్ట్​ఫోన్స్​పై భారీ ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో ఐఫోన్​పై ఆఫర్స్​ చూడటం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతేకాకుండా అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ కూడా ఈ నెల 23 నుంచే ప్రారంభంకానుంది. ఇక వినియోగదారులకు పండగే!

IPL_Entry_Point

సంబంధిత కథనం