Flipkart Big Billion Days Sale: రూ. 6,000 నుంచి రూ. 60,000 వరకు ఫోన్స్​పై ఆఫర్లు-flipkart big billion days sale starts from today bumper offers on various smart phones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Flipkart Big Billion Days Sale: రూ. 6,000 నుంచి రూ. 60,000 వరకు ఫోన్స్​పై ఆఫర్లు

Flipkart Big Billion Days Sale: రూ. 6,000 నుంచి రూ. 60,000 వరకు ఫోన్స్​పై ఆఫర్లు

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 23, 2022 08:35 AM IST

Flipkart Big Billion Days Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో భాగంగా.. రూ. 6,000 నుంచి రూ. 60,000 వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై బంపర్ ఆఫర్‌లు ప్రకటించారు. Samsung, Mi, POCO వంటి ప్రసిద్ధి బ్రాండ్స్ కూడా.. స్మార్ట్ ఫోన్లను భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో వస్తున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

<p>ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022</p>
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022

Flipkart Big Billion Days Sale 2022 : సెప్టెంబర్ 23, 2022 నుంచి.. అంటే నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. షాపోహోలిక్‌లు పెద్ద డిస్కౌంట్‌లను పొందేందుకు తమకు నచ్చేవి పొందేందుకు ఎగబడుతున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్‌స్క్రైబర్‌ల కోసం.. అతిపెద్ద విక్రయం ఇప్పటికే ప్రారంభించేశారు. వారు ఎలక్ట్రానిక్స్‌పై అన్ని ముఖ్యమైన డీల్‌లు, ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద ఈవెంట్‌కు ముందు అనేక మొబైల్ పరికరాలపై అద్భుతమైన తగ్గింపులు, డీల్‌లతో వచ్చింది. Samsung, Mi, POCO వంటి ప్రసిద్ధ బ్రాండ్‌లు మొబైల్ ఫోన్‌లపై అదిరే డిస్కౌంట్‌లు ప్రకటించాయి. వాటికి తోడుగా.. బ్యాంక్ ఆఫర్‌లు కూడా బాగా ఇస్తున్నారు. అందుకే రూ.6,000 నుంచి రూ.60,000 వరకు ఉన్న ఫోన్లపై అది ఆఫర్లు అందించాయి.

Samsung

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ రివీల్ ఆఫ్ ది డే ప్రకారం.. Samsung F23 5G స్మార్ట్‌ఫోన్ ధరలు రూ.22,999కి బదులుగా రూ.10,999 నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం రూ. 1,01,999 ధరలో ఉన్న Samsung S22+ S సిరీస్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంది. ఇది గణనీయమైన ధర తగ్గింపుగా చెప్పవచ్చు. మీరు Samsung Galaxy S21 FE 5Gని రూ. 31,999కి (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) కొనుగోలు చేయవచ్చు.

Mi

Mi ఉత్పత్తులు కూడా సేల్​లో మంచి డీల్స్ ఇస్తున్నాయి. Xiaomi 11i హైపర్ ఛార్జ్ 5G ధర రూ. 19,999 మాత్రమే. 6 GB Redmi 10 Prime ధర కేవలం రూ. 12,149. Redmi Note 10T 5G రూ. 11,699కి అందుబాటులో ఉంది.

Oppo

Flipkart అతిపెద్ద విక్రయంలో Oppo K10 ధర రూ. 11,990 నుంచి ప్రారంభమవుతుంది. Oppo F19s ధర రూ. 12,990.

Infinix

Infinix నుంచి పరికరాలు సాధ్యమైనంత తక్కువ ధరలకు విక్రయిస్తారు. Infinix Smart 6 కేవలం రూ. 5,849తో ప్రారంభమవుతుంది. Infinix Note 12 Pro 5G ధర రూ. 12,599 మాత్రమే.

Motorola

Motorola మొబైల్‌ల ధరలు రూ. 8,000 నుంచి రూ. 23,000 వరకు ఉంటాయి. ఇవి వినియోగదారులకు చాలా సరసమైన ధరల్లో లభిస్తాయి. Motorola Edge 30 ధర రూ.22,749 నుంచి ప్రారంభమవుతుంది. Moto G52 ధరలు రూ. 12,599 నుంచి మొదలవుతాయి.

Whats_app_banner