Infinix Smart 6 - ఈ ఫోన్ సైజ్ పెద్దది, ధర చిన్నది!
ఇన్ఫినిక్స్ నుంచి Infinix Smart 6 అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదలయింది. ఫీచర్లు, ధర తదితర విషయాలు ఇక్కడ చూడండి..
హాంగ్ కాంగ్‌కు చెందిన మొబైల్ తయారీదారు ఇన్ఫినిక్స్ తాజాగా Infinix Smart 6 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ స్పెసిఫికేషన్‌లతో వచ్చిన 4G స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలోనే వినియోగదారులకు ఉత్తమైన ఫీచర్లు కల్పిస్తుంది. ఇందులో భాగంగా Infinix Smart 6 స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, మంచి ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ, DTS ఆడియో ప్రాసెసింగ్, ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ మొదలగు ఫీచర్లను కల్పిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
ఇంకా ఇందులో స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి..
Infinix Smart 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే
4GB RAM (2GB + 2GB వర్చువల్ RAM), 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్
వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
ధర రూ. 7,499/-
ఈ ఫోన్ ఒకే వేరియంట్‌లో విడుదలైంది, ఇతర వేరియంట్‌లు ఏవీ లేవు. అలాగే ఈ సరికొత్త ఫోన్- లైట్ ఆఫ్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రి పర్పుల్, హార్ట్ ఆఫ్ ఓషన్ అనే నాలుగు కలర్లలో లభిస్తుంది. మే 6, 2022 నుంచి Flipkart ద్వారా ఈ మొబైల్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం