Motorola Edge 30 Ultra। మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌‌పై రూ. 5 వేల డిస్కౌంట్!-motorola edge 30 ultra 5g smartphone launched check price and discount offers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Motorola Edge 30 Ultra 5g Smartphone Launched, Check Price And Discount Offers

Motorola Edge 30 Ultra। మోటోరోలా కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌‌పై రూ. 5 వేల డిస్కౌంట్!

HT Telugu Desk HT Telugu
Sep 13, 2022 05:03 PM IST

మోటొరోలా బ్రాండ్ నుంచి Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. లాంచ్ ఆఫర్ కింద రూ. 5 వేల డిస్కౌంట్ ఇస్తున్నారు, అదనపు తగ్గింపులు ఉన్నాయి. ఆ వివరాలు చూడండి.

Motorola Edge 30 Ultra
Motorola Edge 30 Ultra

లెనోవా యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటొరోలా ఇటీవల కాలంగా వరుసగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తోంది. తాజాగా తమ Edge సిరీస్‌లో 'మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రా' పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto Edge 30 Ultra అనేది కంపెనీ నుంచి విడుదలైన ఒక ఫ్లాగ్‌షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీనిలో అందించిన కెమెరా. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ కెమెరాతో ప్రకాశవంతమైన ఫోటోలను తీయవచ్చు. ఇదేకాకుండా శక్తివంతమైన Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 చిప్‌సెట్, వేగవంరమైన రిఫ్రెష్ రేట్, 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్‌ను లోడ్ చేశారు.

Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్లో లభిస్తుంది. అయితే రెండు కలర్ వేరియంట్లలో లభ్యమవుతోంది. ఇది ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 59,999/-. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ధరపై రూ. 5 వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 సందర్భంగా మోటొరోలా ఎడ్జ్ 30 అల్ట్రాను పరిమిత కాలానికి రూ. 54,999/- ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ సరికొత్త Moto ఎడ్జ్ 30లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల pOLED FHD+ కర్వ్‌డ్ డిస్‌ప్లే
  • 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్
  • వెనకవైపు 200MP + 50MP + 12MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 60MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4610 mAh బ్యాటరీ సామర్థ్యం, 125W ఛార్జర్
  • డాల్బీ అట్మోస్‌ స్పీకర్లు

ఈ హ్యాండ్‌సెట్ డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం.. 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, USB టైప్-సి పోర్ట్ సహా మరిన్నింటిని కలిగి ఉంది.

Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్ 22, 2022 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. ICICI , AXIS బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు దీని ధరపై 10 శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్