Motorola నుంచి సొగసైన 5G స్మార్ట్‌ఫోన్ Moto Edge 30 విడుదల!
మోటోరోలా మరొక 5G స్మార్ట్‌ఫోన్ Moto Edge 30ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఫీచర్లు, ధరలు, డిస్కౌంట్స్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా కంపెనీ Edge సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Moto Edge 30 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే అలాగే బ్యాటరీ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ఇది 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 32.1 గంటల బ్యాటరీ బ్యాకప్‌ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. మోటరోలా ఈ హ్యాండ్ సెట్ ను ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొంటోంది, దీని మందం 6.79 మి.మీ, బరువు 155 గ్రాములు.
అంతేకాదు ఈ హ్యాండ్‌సెట్ డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉంది. ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
ఈ సరికొత్త Moto ఎడ్జ్ 30లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Moto EDGE 30 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల pOLED FHD+ డిస్‌ప్లే
- 6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్
- వెనకవైపు 50 మెగా పిక్సెల్ + 50MP + 2MP క్వాడ్ కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4020 mAh బ్యాటరీ సామర్థ్యం, 33W ఛార్జర్
- 6GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27,999/-
- రెండవ వేరియంట్ 8GB RAM+128GB స్టోరేజ్ ధర రూ. 29,999/-
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌లో 5G, 4G LTE, WiFi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లోని సెన్సార్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, కంపాస్ ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు.
Moto ఎడ్జ్ 30 అరోరా గ్రీన్, మెటియోర్ గ్రే అనే రెండు కలర్ ఛాయిస్‌లలో లభిస్తోంది. ఇది ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, ఇతర రిటైల్ స్టోర్‌లలో మే 19 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ద్వారా, EMI లావాదేవీలపై 2,000 డిస్కౌంట్ లభిస్తుంది.
సంబంధిత కథనం