శక్తివంతమైన బ్యాటరీతో Redmi 10 స్మార్ట్‌ఫోన్ విడుదల
సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Redmi 10 భారత మార్కెట్లో విడుదల అయింది. దీని ధర రూ. 11 వేల నుంచి ప్రారంభమవుతుంది.
రెడ్‌మీ ఇండియా తమ బ్రాండ్ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 10ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది పసిఫిక్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ , కరేబియన్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 11 వేల నుంచి ప్రారంభమవుతుంది.
ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను బట్టి Redmi 10 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 10,999/- గా ఉండగా.. 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999/- గా నిర్ణయించారు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించి కొనుగోలు చేసేవారికి రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది.
ఈ ఫోన్ Mi.com, Flipkart అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా మార్చి 24 మధ్యాహ్నం 12 గంటల నుండి విక్రయాలు ప్రారంభించనున్నట్లు రెడ్‌మీ ఇండియా తెలిపింది.
Redmi 10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
6.71-అంగుళాల IPS LCD HD డిస్‌ప్లే
4/6GB RAM, 64/128GB స్టోరేజ్ సామర్థ్యం
క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్
వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఫాస్ట్ ఛార్జర్
ధరలు రూ. 10,999 నుంచి రూ. 12,999 వరకు
రెడ్‌మి ఇండియా కంపెనీ రెడ్‌మి నోట్ 11 ప్రో సిరీస్‌ను విడుదల చేసిన వారం రోజుల తర్వాత ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయడం గమనార్హం.
సంబంధిత కథనం