US inflation data : అమెరికాలో తగ్గిన ద్రవ్యోల్బణం.. దిగొస్తున్న ధరలు!-us cpi data announced consumer inflation eased to 7 7 in october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Us Cpi Data Announced, Consumer Inflation Eased To 7.7% In October

US inflation data : అమెరికాలో తగ్గిన ద్రవ్యోల్బణం.. దిగొస్తున్న ధరలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 08:52 AM IST

US CPI data October 2022 : యూఎస్​ సీపీఐ డేటా.. అంచనాల కన్నా తక్కువగా నమోదుకావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందని నిపుణులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో తగ్గిన ద్రవ్యోల్బణం.. దిగొస్తున్న ధరలు!
అమెరికాలో తగ్గిన ద్రవ్యోల్బణం.. దిగొస్తున్న ధరలు! (AFP)

US CPI data October 2022 : అక్టోబర్​ నెలకు సంబంధించిన యూఎస్​ సీపీఐ డేటా విడుదలైంది. గత నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం 7.7శాతంగా నమోదైంది. సెప్టెంబర్​ నెలతో పోల్చుకుంటే ఇది 0.4శాతం ఎక్కువ. ఆహార, ఇంధన ధరలను మినహాయిస్తే.. అక్టోబర్​లో కోర్​ ఇన్​ఫ్లేషన్​ 6.3శాతంగా నమోదైంది. సెప్టెంబర్​తో పోల్చుకుంటే ఇది 0.3శాతం ఎక్కువగా ఉంది. ఈ వివరాలను అమెరికా లేబర్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది.

అయితే.. ఈ లెక్కలన్నీ అంచనాల కన్నా తక్కువగా నమోదుకావడంతో అమెరికా ప్రభుత్వ ఊపిరి పీల్చుకుంది. సెప్టెంబర్​తో పోల్చుకుంటే అక్టోబర్​లో ద్రవ్యోల్బణం తగ్గడంతో.. ఇక దేశవ్యాప్తంగా ధరలకు దిగొస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫెడ్​ చర్యలేంటి..?

US CPI data : అమెరికాలో ఇంతకాలం ద్రవ్యోల్బణం ఆందోళనకర రీతిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలినాళ్ల నుంచి.. 'వడ్డీ రేట్ల పెంపు' అస్త్రాన్ని ప్రయోగిస్తోంది ఫెడ్​. అయినప్పటికీ ద్రవ్యోల్బణం దిగి రాకపోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. ఆర్థిక వ్యవస్థను కూడా లెక్క చేయకుండా.. వడ్డీ రేట్లను విపరీతంగా పెంచి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ఫెడ్​ అధికారులు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఆరుసార్లు వడ్డీ రేట్లు పెరిగాయి.

ఇక ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గిందన్న డేటాపై నిపుణుల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్​ దూకుడు కొనసాగిస్తుందని కొందరు అభిప్రాయడుతున్నారు. మరికొందరు.. ఫెడ్​ శాంతించవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్​ ఇంతకాలం తీసుకున్న నిర్ణయాలతో.. అమెరికాలో వచ్చే ఏడాది రెసెషన్​ వస్తుందని అనేకమంది నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికాలో ఇటీవలే మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఓటర్లలో.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతలో.. ద్రవ్యోల్బణం కూడా ఓ కారణంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు అనేక సీట్లు కోల్పోయారు!

దిగొస్తున్న ధరలు..

America inflation latest news : అమెరికాలో షిప్పింగ్​ కాస్ట్​ తగ్గుతోంది. రియల్​ టైమ్​ రెంట్స్​ కూడా దిగొస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరత కారణంగా.. ఆటో కంపెనీలపై మాత్రం ప్రభావం తగ్గడం లేదు. అయితే.. సప్లై చెయిన్​ వ్యవస్థ మెరుగుపడుతుండటం ఉపశమనాన్ని కలిగించే విషయం. ఏడాది కాలంలో విపరీతంగా పెరిగిన సెకండ్​ హ్యాండ్​ కార్ల ధరలు కూడా దిగొస్తున్నాయి.

US housing market : కానీ.. ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపుతో అమెరికా హౌజింగ్​ మార్కెట్​పై భారీ ప్రభావం చూపించినట్టు కనిపిస్తోంది. 30ఏళ్ల ఫిక్స్​డ్​ మార్టిగేజ్​ సగటు ధరలు.. ఏడాది కాలంల రెండింతలు పెరిగిపోయాయి. 7శాతానికి చేరి, గత వారంలోనే కాస్త తగ్గింది. ఫలితంగా హౌజింగ్​ మార్కెట్​లో పెట్టుబడులు పతనమయ్యాయి. సేల్స్​ తగ్గిపోయాయి.

యూఎస్​ సీపీఐ డేటా.. అంచనాల కన్నా తక్కువ రావడంతో స్టాక్​ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. డౌ జోన్స్​ 3.70శాతం మేర బలపడింది. ఎస్​ ఎండ్​ పీ 500 ఏకంగా 5.54శాతం లాభపడింది. నాస్​డాక్​ అయితే.. 7.35శాతం మేర పుంజుకుంది.

WhatsApp channel

సంబంధిత కథనం