IPL 2025 Auction: తొలి రోజు వేలం తర్వాత ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంతెంత డబ్బు మిగిలి ఉందంటే? సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద లీస్ట్‌-ipl 2025 auction remaining purse of all 10 teams after day 1 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction: తొలి రోజు వేలం తర్వాత ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంతెంత డబ్బు మిగిలి ఉందంటే? సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద లీస్ట్‌

IPL 2025 Auction: తొలి రోజు వేలం తర్వాత ఏ ఫ్రాంఛైజీ వద్ద ఎంతెంత డబ్బు మిగిలి ఉందంటే? సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద లీస్ట్‌

Galeti Rajendra HT Telugu
Nov 25, 2024 08:30 AM IST

IPL 10 Teams Purse After Day 1 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజే చాలా ఫ్రాంఛైజీలు తమ పర్స్‌లోని 80% శాతం ఖర్చు చేసేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే మరీ దారుణంగా ఖర్చు చేసేసింది. దాంతో.. సోమవారానికి?

ఐపీఎల్ 2025 వేలం
ఐపీఎల్ 2025 వేలం (HT_PRINT)

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ముగిసేసరికి.. దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు ముప్పావు శాతం డబ్బుని ఖర్చుచేసి తమ కోర్‌ టీమ్‌ను కొనుగోలు చేసేశాయి. ఇక వేలంలో రెండోజైన సోమవారం పూర్తి జట్టుని సిద్ధం చేసుకోనున్నాయి. ఆదివారం భారత స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కురవగా.. కొంత మంది విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు.

ఐపీఎల్ వేలంలో తొలిరోజైన ఆదివారం మొత్తం 72 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు కలిపి రూ.467 కోట్లు ఖర్చు చేశాయి. సోమవారానికి ఏ జట్టు పర్సులో ఎంత డబ్బు మిగిలిందో చూద్దాం. అలాగే ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండే వెసులబాటు ఉండగా.. ఒక్కో టీమ్‌లో ఎన్ని స్లాట్లు మిగిలి ఉన్నాయో కూడా తెలుసుకుందాం.

1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఖర్చు: రూ.104.40 కోట్లు

పర్సులో మిగిలింది: రూ.15.60 కోట్లు

టీమ్‌లో మిగిలిన మొత్తం స్లాట్స్: 13

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు: 4

2. ముంబై ఇండియన్స్ (MI)

ఖర్చు: రూ.93.90 కోట్లు

పర్సులో మిగిలింది : రూ.26.10 కోట్లు

టీమ్‌లో మిగిలి ఉన్న స్లాట్లు : 16

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 7

3. పంజాబ్ కింగ్స్ (PBKS)

ఖర్చు: రూ.97.50 కోట్లు

పర్సులో మిగిలింది : రూ.22.50 కోట్ల

టీమ్‌లో మిగిలిన స్లాట్లు : 13

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు: 6

4. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

ఖర్చు: రూ.106.20 కోట్లు

పర్సులో మిగిలింది : రూ.13.80 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు : 12

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 4

5. గుజరాత్ టైటాన్స్ (GT)

ఖర్చు: 102.50 కోట్ల

పర్స్‌లో మిగిలింది: రూ.17.50 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు: 11

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 5

6. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)

ఖర్చు: రూ.114.85 కోట్లు

పర్సులో మిగిలింది: రూ.5.15 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు: 12

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు: 4

7. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

ఖర్చు: రూ.105.15 కోట్లు

పర్సులో మిగిలింది: రూ.14.85 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు : 13

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 4

8. కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

ఖర్చు: రూ.104.40 కోట్లు

పర్సులో మిగిలింది : రూ.15.60 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్స్ : 13

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 4

9. రాజస్థాన్ రాయల్స్ (RR)

ఖర్చు: రూ.102.65 కోట్లు

పర్సులో మిగిలింది : రూ.17.35 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు : 14

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు : 4

10. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

ఖర్చు: రూ.89.35 కోట్లు

పర్సులో మిగిలింది: రూ.30.65 కోట్లు

టీమ్‌లో మిగిలిన స్లాట్లు : 16

ఖాళీగా ఉన్న విదేశీ స్లాట్లు: 5

Whats_app_banner