Naga Chaitanya Sobhita Dhulipala: మొదలైన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి పనులు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Naga Chaitanya Sobhita Dhulipala Pre Wedding Photos: నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి సందడి అప్పుడే మొదలైపోయింది. వధువు అయిన శోభిత ఇంట్లో పెళ్లికి మొదటి వేడుక గోధుమ రాయి పసుపు దంచుడుతో ప్రీ వెడ్డింగ్ పనులు స్టార్ట్ అయిపోయాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది శోభిత ధూళిపాళ.
(1 / 8)
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి మొదలైంది. వధువు మొదటి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'గోధుమా రాయ్ పసుపు దంచడం. అలా మొదలవుతుంది' అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది శోబిత.
(2 / 8)
విశాఖలో నాగ చైతన్య శోభిత ధూళిపాళ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అయ్యాయి. రుబ్బురోలులో గోధుమలను పసుపు కలిపి దంచడాన్నే 'గోధుమ రాయి పసుపు దంచటం' అంటారు. ఈ వేడుకతోనే శోభిత పెళ్లి వేడుకలు మొదలు అయ్యాయి.
(3 / 8)
తెలుగు సాంప్రాదాయం ప్రకారం వధూవరులు కలిసి గోధుమలు, పసుపు, కొన్నిసార్లు ఇతర పదార్థాలను రుబ్బురోలులో దంచే ఆచారం ముఖ్యమైనది. ఇక్కడ శోభిత ఆ వేడుకను చేయడం చూడవచ్చు. ఈ వేడుక వారి జీవిత ప్రారంభానికి ప్రతీకగా ఉంటుంది.
(4 / 8)
ఈ శుభసందర్భం సందర్భంగా కుటుంబ సభ్యులు ఒక్కచోట చేరి ఇళ్లను అరటి అరటి పండ్లు, పూలతో అలంకరిస్తారు. అలాగే, ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి శోభిత ఎంతో సంతోషంగా కనిపించింది.
(5 / 8)
శోభిత ఈ వేడుకకు సింపుల్ సిల్క్ చీరను కట్టుకుంది. అలాగే, ఆకుపచ్చ, బంగారు, క్రీమ్, ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ పట్టుచీరను ఎంచుకుని సంప్రదాయబద్ధానికి అద్దంపట్టింది. భుజంపై నుంచి పల్లు కిందకు జారవిడిచింది. పై ఫొటోలో పెద్దల ఆశీర్వాదం తీసుకుంది శోభితా.
(6 / 8)
శోభిత చీరకు సరిపోయే క్రీమ్ సిల్క్ బ్లౌజ్‌తో పాటు వి-నెక్ లైన్, క్రాప్డ్ హెమ్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్‌తో గోల్డ్ బ్యాండ్ ను యాడ్ చేసింది. జుమ్కీలు, చోకర్ నెక్లెస్, కధాలు, ఉంగరం, నెక్లెస్ వంటి సంప్రదాయ బంగారు ఆభరణాలను శోభిత ధరించింది.
(7 / 8)
అలాగే, శోభిత ఆకుపచ్చ గాజులు ధరించి తన ట్రెడిషనల్ లుక్ ను పూర్తి చేసింది. ఆమె తన జుట్టును మధ్య భాగంలో, గజ్రా అలంకరించిన హెయిర్ స్టయిల్‌లో కట్టుకుంది. ఇక ఈ వేడుకలో ఫ్రెండ్స్‌తో కలిసి సరదా ముచ్చట్లతో సంతోషంగా గడిపింది.
ఇతర గ్యాలరీలు