Priyanka Chopra: ముంబైకి వచ్చిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ తిరిగిన ప్లేసులు, ఈవెంట్స్ ఏవో తెలుసా?
Priyanka Chopra In Mumbai Photos: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బుధవారం (అక్టోబర్ 16) మధ్యాహ్నం ముంబైకి చేరుకుంది. తనకున్న షెడ్యూల్ ముగించుకుని శనివారం (అక్టోబర్ 19) తెల్లవారు జామున నగరం నుంచి బయలుదేరింది. ఈ నేపథ్యంలో మూడు రోజులు ముంబైలో ఉన్న ప్రియాంక చోప్రా తిరిగిన ప్లేసులు ఏంటో లుక్కేద్దాం.
(1 / 10)
బుధవారం భారత్ కు వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కేవలం రెండు రోజుల్లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం ఆమె దేశం విడిచి వెళ్లారు. ఆమె నటించిన పానీ సినిమా స్క్రీనింగ్ కు హాజరయ్యారు. రుచికరమైన ఆహారాన్ని కూడా ఆమె తిని నగరంలోని వాతావరణాన్ని ఆస్వాదించారు.
(2 / 10)
ప్రియాంక చోప్రా ముంబై బస చేసినప్పుడు దిగిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ‘ఫుల్ క్యాలెండర్, కచ్చితంగా.. కానీ అది కూడా చిన్న చిన్న విషయాలే’ అంటూ కన్నీటి ఎమోజీని షేర్ చేసింది.
(3 / 10)
రంగురంగుల దుస్తులు, సన్ గ్లాసెస్, వైట్ హీల్స్ ధరించిన ఫోటోను ప్రియాంక చోప్రా పోస్ట్ చేసింది. ఈ క్యాండిడ్ ఫోటోలో ఆమె ఒక గదిలో స్టైల్‌గా నిల్చుంది.
(4 / 10)
ప్రియాంక చోప్రా తన గది నుండి నగర దృశ్యాలను ఆస్వాదిస్తున్న ఫోటోను పంచుకుంది. బాత్ రూంలో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో వెనుక వైపు నుంచి ప్రియాంక కనిపించింది.
(5 / 10)
ప్రియాంక చోప్రా ఓ టేబుల్‌పై కూర్చొని తన స్నేహితులు, టీమ్ మెంబర్స్‌తో కలిసి ఇలా ఫోజులిచ్చింది.
(6 / 10)
(7 / 10)
ప్రియాంక చోప్రా కొద్దిసేపు ఉన్న సమయంలో కూడా భారతీయ, చైనీస్, ఇటాలియన్‌తో సహా రుచికరమైన ఆహారాన్ని రుచి చూసింది. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఉన్న ఫొటోను షేర్ చేసింది.
(8 / 10)
ఈ ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా మెరిసే గోల్డెన్ ఆఫ్ షోల్డర్ దుస్తులు, హీల్స్‌ను ఎంచుకుంది. ఇలా కెమెరాకు ఫోజులిచ్చింది.
(9 / 10)
ప్రియాంక చోప్రా శనివారం తెల్లవారుజామున ముంబై నుంచి బయలుదేరింది. మొత్తంగా ముంబైని రెండు రోజులపాటు ఆస్వాదించింది.
ఇతర గ్యాలరీలు